ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. బుధవారం ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్గాన్.. ఇంగ్లండ్‌ను ఓడించింది. దీంతో.. ఇంగ్లండ్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో.. ఆఫ్ఘన్ జట్టు కోచ్ జోనాథన్ ట్రాట్ ఆస్ట్రేలియాకు ఓ వార్నింగ్ ఇచ్చాడు. ‘ఇప్పుడు ఎవరూ ఆఫ్ఘన్ జట్టును తేలికగా తీసుకోరు. గతంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ అద్భుతంగా రాణించింది. ఇప్పుడు మేము మరింత బలంగా ఉన్నాము. తర్వాత జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ మ్యాచ్ సెమీ ఫైనల్స్ మార్గాన్ని నిర్ణయించే మ్యాచ్ కావడం వల్ల’ అని ట్రాట్ పేర్కొన్నాడు.
Read Also: Kaleshwaram Commission : కాళేశ్వరం కమిషన్ ముందు ముగిసిన మాజీ ఈఎన్సీల విచారణ
2023 ప్రపంచ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లను ఓడించి సెమీ-ఫైనల్స్‌కు చేరుకుంది. “మేము ఆస్ట్రేలియాను కూడా ఓడించాము. ఈ విజయాలతో మా నమ్మకం మరింత పెరిగింది. నేను కోచ్ అయిన తర్వాత, ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాతో మూడుసార్లు మ్యాచ్‌లు ఆడింది. మేము మూడు మ్యాచ్‌ల్లోనూ బాగా ఆడాము. మా ఆటగాళ్లు ఇప్పుడు మరింత మెచ్యూర్‌గా ఉన్నారు. ఇప్పుడు ఎవరూ ఆఫ్ఘనిస్తాన్‌ను తేలికగా తీసుకోరు’ అని ట్రోట్ అన్నాడు.
Read Also: వివాదంలో ‘చావా’… చరిత్రని వక్రీకరించారా?
2022లో కోచ్‌గా జోనాథన్ ట్రాట్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు బాధ్యతలు చేపట్టిన తరువాత.. జట్టు మరింత పురోగతి సాధించింది. “2022లో కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు జట్టు చాలా కఠినంగా ఉండేది. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందింది. మా ఆటగాళ్లకు ఇంకా గొప్ప ఆశలు ఉన్నాయి. మనం ఏమి సాధించగలమో ఎవరికీ తెలీదు,” అని ట్రాట్ తెలిపాడు.