Site icon NTV Telugu

AFG vs PAK: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ పాకిస్తాన్.. ఆఫ్గనిస్తాన్ అద్భుత విజయం!

Afg Vs Pak

Afg Vs Pak

AFG vs PAK: యుఏఈలో జరుగుతున్న ట్రై సిరీస్‌లో భాగంగా సెప్టెంబర్ 2న షార్జా వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ జట్టు పాకిస్తాన్‌పై మరో సూపర్ విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఇక దీనికి జవాబుగా.. లక్ష్యం చేధించడానికి వచ్చిన పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి కేవలం 151కి మాత్రమే పరిమితమైంది. దీనితో అఫ్గానిస్తాన్ జట్టు 18 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.

Fraud : 500 కోట్ల షెల్ కంపెనీల మోసం.. హైదరాబాద్ లో సంచలనం!

అఫ్గానిస్తాన్ తరఫున ఇబ్రాహీమ్ జాద్రాన్ 65 పరుగులు (45 బంతుల్లో) అద్భుత ఇన్నింగ్స్ ఆడడంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అతనికి తోడు సెడికుల్లా అతల్ 64 పరుగులతో రాణించాడు. ఫహీమ్ అష్రఫ్ పాకిస్తాన్ బౌలింగ్ విభాగంలో 4 వికెట్లు తీసి మెరిసినా, మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

Drugs : విశాఖలో డ్రగ్స్ షాక్‌.. బీటెక్ విద్యార్థి, యువతి, స్నేహితుడు అరెస్ట్!

ఇక లక్ష్య చేధనలో పాకిస్తాన్ బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోతూ ఒత్తిడిలో పడిపోయారు. ఫఖర్ జమాన్ (25), సల్మాన్ ఆఘా (20) కొంత ప్రతిఘటన ఇచ్చినా, మధ్యలో వరుసగా వికెట్లు పడిపోవడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ కుదేలైంది. చివర్లో హారిస్ రౌఫ్ 34 నాటౌట్ (16 బంతుల్లో) శక్తివంతమైన హిట్టింగ్ చేసినా జట్టును గెలుపు బాట పట్టించలేకపోయాడు. ఇక అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ, నూర్ అహ్మద్ తలోదరు చెరో 2 వికెట్లు తీసి పాకిస్తాన్ ను కట్టడి చేశారు.

Exit mobile version