Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం అమెరికాకు సవాల్ విసిరింది. ట్రంప్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్థాన్‌లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలను చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై అఫ్ఘానిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. అమెరికా ప్రయత్నాలను ఒక బూటకమని పేర్కొన్నారు. అమెరికన్లకు ఆఫ్ఘన్ భూమిలో ఒక్క ముక్క కూడా లభించదని ఆయన స్పష్టం చేశారు. బాగ్రామ్ వైమానిక స్థావరం ఇప్పుడు తాలిబన్ ప్రభుత్వ నియంత్రణలో ఉందని, ఆఫ్ఘాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై రాజీపడదని పేర్కొన్నారు. దేశ విధానం సమతుల్యమైనదని, తాలిబన్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించిందని, పరస్పర ప్రయోజనాల ఆధారంగా అన్ని దేశాలతో సంబంధాలను కొనసాగించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు.
READ ALSO: Pawan Kalyan: నేను మర్చిపోయా..డిప్యూటీ సీఎం ఇలా కత్తి పట్టుకుని వస్తాడా?
యూకే పర్యటనలో ట్రంప్ ప్రకటన..
ఇటీవల UK పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అమెరికా ఆఫ్ఘనిస్థాన్‌ను విడిచి పెట్టింది, కానీ బలం, గౌరవంతో ప్రపంచంలోని అతిపెద్ద వైమానిక స్థావరాలలో ఒకటైన బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని నిలుపుకుంటామని పేర్కొన్నారు. ఆఫ్ఘన్ ప్రభుత్వం దీనికి కట్టుబడి ఉండకపోతే, అది భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని హెచ్చరించారు. అయితే 2021లో US దళాల ఉపసంహరణ తర్వాత బాగ్రామ్ ఇప్పుడు తాలిబన్లకు చెందినదని, దోహా ఒప్పందం ప్రకారం US తన కట్టుబాట్లను గౌరవిస్తుందని స్పష్టం చేశారు.
ట్రంప్ బెదిరింపులకు భయపడం..
ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం అమెరికా బెదిరింపులకు భయపడం అని స్పష్టం చేసింది. ఆఫ్ఘన్ గడ్డపై ఎటువంటి రాజీ ఉండదని, ట్రంప్ బెదిరింపులు ఎవరినీ ఒప్పించవని పేర్కొంది. బాగ్రామ్ వైమానిక స్థావరం ఆఫ్ఘన్ నియంత్రణలోనే ఉంటుందని వెల్లడించింది. ఈ కథ ఆఫ్ఘన్ సార్వభౌమాధికారం, అమెరికా వ్యూహాత్మక ఆశయాల మధ్య సంఘర్షణను వెల్లడిస్తుంది. 2021లో అమెరికా, మిత్రరాజ్యాల దళాలు ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఉపసంహరించుకున్నప్పటి నుంచి తాలిబాన్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న స్థావరంపై తిరిగి నియంత్రణ సాధించడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఆఫ్ఘన్ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ దోహా ఒప్పందాన్ని ఉదహరించింది. దీనిలో అమెరికా ఆఫ్ఘనిస్థాన్ ప్రాదేశిక సమగ్రత, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదని ప్రతిజ్ఞ చేసింది. బాగ్రామ్ వైమానిక స్థావరం ప్రస్తుతం తాలిబాన్ ప్రభుత్వ నియంత్రణలో ఉంది. ఇది కాబూల్‌కు ఉత్తరాన ఉంది. ఇది 20 సంవత్సరాలుగా US సైనిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా పని చేసింది.
READ ALSO: Indian Fighter Jets: భారత్ తేజస్ MK-2 ముందు పాక్ F-16 జుజుబీ..
