Afghanistan Defence Minister Mullah Yaqoob: ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మధ్య ఇటీవల జరిగిన ఘర్షణల్లో భారత్ కీలక పాత్ర పోషించిందని పాక్ రక్షణ మంత్రి పిచ్చికూతలు కూశారు. ఈ వాదనలను తాజాగా ఆఫ్ఘనిస్థాన్ రక్షణ మంత్రి ముల్లా యాకూబ్ ఖండించారు. అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాకూబ్ ఈ ఆరోపణలను నిరాధారంగా పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “ఈ వాదనలు నిరాధారమైనవి. మా భూభాగాన్ని ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఉపయోగించాలనే విధానం మాకు లేదు. మనది స్వతంత్ర దేశం. భారతదేశం, పాకిస్థాన్‌లతో మన సంబంధాలు పూర్తిగా జాతీయ ప్రయోజనాల ద్వారానే మార్గనిర్దేశం చేయబడ్డాయి” అని స్పష్టం చేశారు.
READ MORE: Rashmika: థామా జర్నీ నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది..
కాగా.. తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ముత్తాకి భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. మంత్రి భారత పర్యటనలో ఉండగానే అక్టోబర్ 11న కాబూల్‌లో పేలుళ్లు జరిగాయి. ఒక రోజు తరువాత పాకిస్థాన్ దక్షిణ సరిహద్దులో తాలిబాన్ యోధులు దాడులు ప్రారంభించారు. ఈ దాడులపై ఇస్లామాబాద్ స్పందించింది. సరిహద్దులో జరుగుతున్న కాల్పుల్లో భారత్ పాత్ర ఉందంటూ పాక్ నిందించింది. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాలిబన్ నాయకత్వం భారత్ ఒడిలో కూర్చొందని.. సరిహద్దుల్లో సరిహద్దు ఉగ్రవాదానికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీనికి ప్రతిస్పందిస్తూ.. భారత MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. “పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు ఆతిథ్యం ఇస్తుంది. ఉగ్రవాద కార్యకలాపాలను స్పాన్సర్ చేస్తుంది. దాని స్వంత అంతర్గత వైఫల్యాలకు పొరుగువారిని నిందించడం పాకిస్థాన్ కొత్తేం కాదు. ఆఫ్ఘనిస్థాన్ తన సొంత భూభాగాలపై సార్వభౌమాధికారాన్ని వినియోగించుకోవడం పట్ల పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భారత్, ఆఫ్ఘనిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్ర్యానికి పూర్తిగా కట్టుబడి ఉంది.” అని ఘాటుగా రిప్లై ఇచ్చారు.
READ MORE: Botsa Satyanarayana: త్వరలోనే రాజయ్యపేటకు జగన్.. ప్రభుత్వంపై బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు..
