Site icon NTV Telugu

Afghanistan-Pakistan: మరోసారి పాక్- ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఘర్షణలు.. పాకిస్థాన్‌ను చిత్తు చేస్తున్న తాలిబన్లు..?

Pak Afg War

Pak Afg War

Afghanistan-Pakistan: తాలిబన్లు, పాకిస్థాన్‌ దళాల మధ్య మరోసారి భీకర పోరాటం జరుగుతోంది. ఆఫ్ఘస్థాన్‌-పాకిస్థాన్‌ సరిహద్దులో ఉన్న స్పిన్ బోల్డాక్‌లో రెండు సైన్యాలు తలబడుతున్నాయి. ఈ రోజు ఉదయం 4 గంటల సమయంలో స్పిన్ బోల్డాక్ ప్రాంతంలో పాకిస్థాన్‌ దళాలు, ఆఫ్ఘన్ తాలిబన్ల మధ్య భారీ పోరాటం జరిగింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. స్పిన్ బోల్డాక్ ఆఫ్ఘస్థాన్‌- పాకిస్థాన్‌ సరిహద్దులో ఉంది. ఇది ఉత్తరాన కాందహార్ నగరానికి, దక్షిణాన పాకిస్థాన్‌ నగరాలైన చమన్, క్వెట్టాకు హైవే ద్వారా అనుసంధానించబడి ఉంది. పశ్చిమ-చమన్ సరిహద్దు క్రాసింగ్ నగరానికి ఆగ్నేయంగా ఉంది.

READ MORE: “𝗡𝗼 𝗖𝗮𝗹𝗹 𝗜𝘀 𝗠𝗼𝗿𝗲 𝗜𝗺𝗽𝗼𝗿𝘁𝗮𝗻𝘁 𝗧𝗵𝗮𝗻 𝗮 𝗟𝗶𝗳𝗲”.. హైదరాబాద్ పోలీస్ స్వీట్ వార్నింగ్..!

పాకిస్థాన్‌ సైనికులతో ఘర్షణ జరిగిన 15 నిమిషాల్లోనే.. తాలిబన్లు పాకిస్థానీలను లొంగిపోయేలా చేశాం.. ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని ఆఫ్ఘన్ తాలిబన్ పేర్కొంది. కాల్పులు జరిగిన 15 నిమిషాల్లోనే తాలిబన్లు పాకిస్థానీయుల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వీడియో ఫుటేజీ బయటకు వచ్చింది. ఈ అంశంపై ఆఫ్ఘస్థాన్‌ జాతీయ భద్రతా మండలి సభ్యుడు స్పందించారు. “స్పిన్ బోల్డాక్ ప్రాంతంలో తాలిబన్లు, పాకిస్థాన్‌ దళాల మధ్య భీకర ఘర్షణలు చెలరేగాయి. బహుళ వర్గాలు ప్రాణనష్టాన్ని చవి చూశాయి. అనేక ఇళ్ళు ధ్వంసమయ్యాయి. డ్యూరాండ్ లైన్ వెంబడి ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్థాన్‌ దళాలు భారీ ఆయుధాలు, వైమానిక శక్తిని ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఇరువైపులా ఇంకా అధికారిక ప్రకటనలు జారీ కాలేదు” అని ఆఫ్ఘస్థాన్‌ జాతీయ భద్రతా మండలి సభ్యుడు కబీర్ హక్మల్ అన్నారు.

READ MORE: Sugali Preeti’s Mother: మరోసారి డిప్యూటీ సీఎం పవన్పై సుగాలి ప్రీతి తల్లి సంచలన వ్యాఖ్యలు

Exit mobile version