NTV Telugu Site icon

Rahmanullah Gurbaz: అఫ్గానిస్థాన్‌ క్రికెటర్ మంచి మనసు.. అర్ధరాత్రి 3 గంటలకు..!

Rahmanullah Gurbaz Ahmedabad

Rahmanullah Gurbaz Ahmedabad

Rahmanullah Gurbaz Helps Homeless Peoples in Ahmedabad: అఫ్గానిస్థాన్‌ యువ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్‌ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. గత నెలలో అఫ్గాన్‌లో భారీ భూకంపం వల్ల నష్టపోయిన అభాగ్యుల కోసం ఫండ్‌ రైజ్‌ చేసి అందించిన గుర్బాజ్‌.. తాజాగా అహ్మదాబాద్‌ వీధుల్లోని నిరాశ్రయులకు తనవంతు ఆర్థిక సాయం అందించాడు. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారికి గుర్బాజ్‌ నగదు పంపిణీ చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఫ్గానిస్థాన్‌ క్రికెటర్ చేసిన పనికి అభిమానుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

శనివారం తెల్లవారుజామున 3 గంటలకు థాల్తేజ్‌లోని దూరదర్శన్ టవర్ దగ్గర నిరాశ్రయులైన వారికి రహ్మనుల్లా గుర్బాజ్‌ డబ్బు పంపిణీ చేశాడు. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారికి గుర్బాజ్‌ నగదు పంపిణీ చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఘాడ నిద్రలో ఉన్న వారిని లేపకుండా.. వారి పక్కన రూ. 500 నోట్స్ పెట్టుకుంటూ వెళ్ళాడు. ఇందుకోసం పక్కనే ఉన్న ఓ మహిళా సాయం తీసుకున్నాడు. నిరాశ్రయులకు డబ్బు ఇచ్చిన అనంతరం గుర్బాజ్‌ కారెక్కి వెళ్లిపోయాడు.

థాల్తేజ్‌ వీధుల్లో రహ్మనుల్లా గుర్బాజ్‌ డబ్బును పంచుతున్న వీడియోను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ‘ఆర్జే లవ్ షా అహ్మదాబాద్‌లోని తన ఇంటి దగ్గర రహ్మనుల్లా గుర్బాజ్‌ను గుర్తించాడు. దీపావళికి ముందు తన ప్రేమను పంచుకున్నాడు. శుక్రవారం ప్రపంచకప్ ప్రయాణం ముగిసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇంటికి తిరుగు ప్రయాణానికి కొన్ని గంటల ముందు నిరాశ్రయులైన వారికి డబ్బు పంచాడు. ఈ చర్యతో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచావు. ఇలాగే మున్ముందు కొనసాగు’ అని ట్వీట్ చేశాడు.

Also Read: Tiger 3 Crackers: థియేటర్‌లో బాణసంచా కాల్చుతూ.. సల్మాన్‌ ఫ్యాన్స్‌ రచ్చ! వీడియో వైరల్

ప్రపంచకప్ 2023లో అద్భుత ప్రదర్శన చేసిన అఫ్గానిస్థాన్‌ క్రికెటర్లకు భారత అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది. తమ దేశంలో క్రికెట్ అభివృద్ధికి భారత్ సాయం ఎప్పటికీ మరిచిపోలేమని పలు సందర్భాల్లో అఫ్గాన్‌ క్రికెటర్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో అఫ్గాన్ యువ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్‌ తన వంతు సాయం చేశాడు. అఫ్గానిస్థాన్‌ 9 మ్యాచులలో 4 విజయాలు అందుకుంది. ఓ దశలో సెమీస్ చేరే అవకాశాలు ఉన్నా.. ఆస్ట్రేలియా చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది.