Tiger 3 Crackers: థియేటర్‌లో బాణసంచా కాల్చుతూ.. సల్మాన్ ఫ్యాన్స్ రచ్చ! వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan fans burst crackers while watching Tiger 3 in Malegaon: బాలీవుడ్ సూపర్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజా సినిమా ‘టైగర్ 3’. యశ్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ భారీ యాక్షన్ సినిమాకు మనీష్ శర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ నటించగా.. ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర చేశాడు. సల్మాన్, కత్రినాల కాంబోలో 2017లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘టైగర్ జిందా హై’కు సీక్వెల్ ఇది. భారీ అంచనాల మధ్య దీపావళి కానుకగా ఆదివారం (నవంబర్ 12) టైగర్ 3 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.
టైగర్ 3 సినిమా విడుదల కోసం ఎప్పటినుంచో ఎదురుచుసిన సల్మాన్ ఖాన్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రిలీజ్ నేపథ్యంలో థియేటర్‌ల ముందు భారీ కటౌట్లు పెట్టి.. బాణసంచా కాల్చుతూ నానా హంగామా చేశారు. అక్కడితో ఆగకుండా.. కొందరు అత్యుత్సాహంతో ఏకంగా థియేటర్ లోపల కూడా టపాకాయలు పేల్చారు. మహారాష్ట్ర మాలేగావ్‌లోని మోహన్ సినిమా థియేటర్‌లో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఫాన్స్ థియేటర్‌లో బాణసంచా కాల్చడంపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున సీట్లకో, కార్పెట్‌కో నిప్పు అంటుకుంటే మంటలు థియేటర్ మొత్తం వ్యాపిస్తాయని.. అప్పుడు ప్రేక్షకుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేస్తున్నారు. థియేటర్‌లో బాణసంచా కాల్చడాన్ని ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. అయినా కూడా కొందరు ఫాన్స్ బాణసంచా కాల్చుతూ హంగామా సృష్టిస్తున్నారు.
As Usual 💥 Salman Khan Fanclub Malegaon continues the TREND of Bursting Crackers in Theatres on Salman Khan’s Entry, Though It is not advised but Fans ka emotion kon Samjhe 💀💥 #Tiger3review #Tiger3 pic.twitter.com/HIoVWKEWBp
— YOGESH (@i_yogesh22) November 12, 2023
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!