Ibrahim Zadran : వరల్డ్ కప్ షాక్.. పాపం ఆఫ్ఘన్ క్రికెట్ టీం కెప్టెన్ ఔట్! కొత్త సారథి ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ibrahim Zadran : ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. టీ20 వరల్డ్ కప్ 2026లో జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో కెప్టెన్సీలో మార్పులు చేస్తూ కీలక ప్రకటన విడుదల చేసింది. స్టార్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ స్థానంలో యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (Ibrahim Zadran)ను ఆఫ్ఘనిస్థాన్ టీ20 జట్టు కొత్త కెప్టెన్‌గా నియమించింది. టీ20 వరల్డ్ కప్ 2026లో గ్రూప్ ‘డి’లో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఘోరంగా విఫలమైంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించి, మొదటి రౌండ్‌లోనే ఈ మెగాటోర్నీ నుంచి ఆఫ్ఘన్ నిష్క్రమించింది. రషీద్ ఖాన్ నేతృత్వంలోని జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో బోర్డు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
READ ALSO: Kavitha Announces New Political Party: తిరుమలకు కాలినడకన కవిత.. కొత్త పార్టీపై కీలక ప్రకటన..
Also Read
ఎవరీ ఇబ్రహీం జద్రాన్..
డిసెంబర్ 12, 2001 ఖోస్త్, ఆఫ్ఘనిస్థాన్‌లో జన్మించిన ఇబ్రహీం జద్రాన్ ఆఫ్ఘన్ జట్టులో నమ్మదగ్గ ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన వయస్సు 24 ఏళ్ల 83 రోజులు. ఇబ్రహీం జద్రాన్ క్రికెట్ ప్రస్థానం పరిశీలిస్తే.. కుడిచేతి వాటం బ్యాటర్, పార్ట్ టైమ్ మీడియం పేస్ బౌలర్‌గా జట్టుకు సేవలందిస్తున్నాడు. ఇబ్రహీం జద్రాన్ ప్రస్తుతం ఆఫ్ఘన్ జట్టులో కీలక ఓపెనర్‌గా మూడు ఫార్మాట్లలోనూ రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఇబ్రహీం జద్రాన్ తన టీ20 కెరీర్‌లో అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. ఆడిన 65 మ్యాచుల్లో 1865 పరుగులు, 33.30 సగటు, 114.83 స్ట్రైక్ రేట్‌ను నెలకొల్పాడు. ఇందులో 16 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి.
ఇబ్రహీం రికార్డులు ఇవే:
ఇబ్రహీం కేవలం టీ20ల్లోనే కాకుండా టెస్టులు, వన్డేల్లోనూ నిలకడగా రాణిస్తున్నాడు.. ఇప్పటి వరకు 8 టెస్టు మ్యాచులు ఆడి 602 పరుగులు (సగటు: 37.62) నమోదు చేశాడు. అలాగే 39 వన్డే మ్యాచుల్లో 1869 పరుగులు (సగటు: 51.91) చేశాడు. టీ20ల విషయానికి వస్తే.. 65 మ్యాచుల్లో 1865 పరుగులు (సగటు: 33.30) చేశాడు. 2026 వరల్డ్ కప్ వైఫల్యం తర్వాత ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్‌ను మళ్లీ గాడిలో పెట్టాల్సిన భారీ బాధ్యత ఇప్పుడు ఇబ్రహీం భుజస్కంధాలపై ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్‌పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్‌లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?