Afghanistan: భారతదేశం బాటలో ఆఫ్ఘనిస్థాన్ నడుస్తుంది. తాజాగా తాలిబన్ల దెబ్బతో పాకిస్థాన్‌లో నీటి కటకట ఏర్పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అసలు ఇండియా అనుసరించింది ఏంటో తెలుసా.. భారత్‌లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దాయాది దేశానికి నీటి సరఫరాను రద్దు చేసింది. ఇప్పుడు ఇదే బాటలో తాలిబన్ ప్రభుత్వం కూడా వేగంగా అడుగులు వేస్తుంది. తాలిబాన్ డిప్యూటీ సమాచార మంత్రి ముజాహిద్ ఫరాహి ఇటీవల మాట్లాడుతూ.. కునార్ నదిపై ఆనకట్టల నిర్మాణాన్ని ఆలస్యం చేయకుండా ప్రారంభించాలని తాలిబాన్ సుప్రీం నాయకుడు షేక్ హిబతుల్లా అఖుంద్జాదా నుంచి జల & ఇంధన మంత్రిత్వ శాఖకు సూచనలు అందాయని ప్రకటించారు. వాస్తవానికి ఈ నది పాకిస్తాన్‌కు ప్రధాన నీటి వనరు అని విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: TheRajaSaab : డార్లింగ్ ప్రభాస్ ‘రాజాసాబ్ పార్ట్ 2’ ఫిక్స్
ముజాహిద్ ఫరాహి మాట్లాడుతూ.. విదేశీ సంస్థల కోసం వేచి ఉండటానికి బదులుగా దేశీయ ఆఫ్ఘన్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని అమీర్ అల్-ముమినీన్ మంత్రిత్వ శాఖను ఆదేశించారు. అలాగే తాలిబన్ మంత్రి ముల్లా అబ్దుల్ లతీఫ్ మన్సూర్ మాట్లాడుతూ.. “ఆఫ్ఘన్లకు వారి నీటి వనరులను నిర్వహించుకునే హక్కు ఉంది” అని నొక్కి చెప్పారు. ప్రాజెక్టు అమలులో జాప్యాలను నివారించడానికి విదేశీ కంపెనీలకు బదులుగా దేశీయ ఆఫ్ఘన్ కంపెనీలకు ప్రాజెక్టు కాంట్రాక్టులు ఇవ్వడం కూడా ఈ సూచనలలో ఉందని చెప్పారు. వాస్తవానికి పాకిస్థాన్‌లో ప్రవహించే కాబూల్, కునార్ నదులు దాయాది దేశానికి ప్రధాన నీటి వనరుగా ఉన్నాయి.
ఇటీవలి ఇండియాలో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత భారతదేశం – పాకిస్థాన్‌తో జల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అలాగే నీటి సరఫరాపై ఆంక్షలు విధించే చర్చలు జరిగాయి. కాశ్మీర్లో 26 మంది పౌరుల హత్య జరిగిన వెంటనే, సింధు నది నీటి ఉపయోగించడాన్ని నియంత్రించే 1960 సింధు జల ఒప్పందంలో భారత ప్రభుత్వం తన భాగస్వామ్యాన్ని నిలిపివేసింది. అలాగే ఈ ఒప్పందాన్ని తిరిగి దాయాది దేశంతో చేసుకోలేదు. ఇదే సమయంలో చీనాబ్ నదిపై ఉన్న రణబీర్ కాలువ పొడవును 120 కి.మీ.కు రెట్టింపు చేయడం పాక్‌కు జల నియంత్రణలో కీలకమైన ప్రణాళికలలో ఒకటి. ఈ నది భారతదేశం గుండా పాకిస్థాన్‌లోని పంజాబ్ వ్యవసాయ ప్రాంతానికి వెళుతుంది.
READ ALSO: Jogi Ramesh: దమ్ముంటే.. నన్ను ఎదురుగా ధైర్యంగా ఎదుర్కొండి.. మాజీ మంత్రి హాట్ కామెంట్స్..!