NTV Telugu Site icon

PAK vs AFG : పాకిస్తాన్ కి షాకిచ్చిన ఆఫ్ఘానిస్తాన్..

Afg Vs Pak

Afg Vs Pak

పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. నిన్న పాక్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ దిహాండ్రెడ్ లీగ్ లో అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో చేరగా తాజాగా పనికూన ఆప్ఘానిస్తాన్ చేతుల్లో పాకిస్తాన్ పరాజయం పాలైంది. ఓడడం అంటే అలా ఇలా కాదు.. కనీసం పోరాటం కూడా లేకుండా బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండ్ విభాగాల్లో అట్టర్ ప్లాప్ అయింది. ఇప్పటిదాకా పాకిస్తాన్ తో 4 వన్డేలు, 3 టీ20 మ్యాచ్ లు ఆడినా విజయం దాకా వచ్చి ఓడిపోతూ వస్తున్న ఆఫ్ఘానిస్తాన్ కి ఇది తొలి విజయం.

Also Read : KK Raju: కాలుష్య నివారణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచుకోవాలి

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 92 పరుగుల స్కోర్ మాత్రమే చేయగలిగింది. సయిం అయూబ్ 15 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్ తో 17 పరుగులు చేయగా మహ్మద్ హారీస్ 11 బంతుల్లో ఓ పోర్ తో 6 పరుగులు చేశాడు. అబ్దుల్లా సఫీక్, వికెట్ కీపర్ ఆజమ్ ఖాన్ డకౌట్ కాగా తయ్యబ్ తహీర్ 9 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇమాద్ వసీం 32 బంతులు ఆడినా ఒ్క బౌండరీ కూడా కొట్టలేక 18 పరుగులు చేశాడు.

Also Read : Match Fixing : మరోసారి వెలుగులోకి మ్యాచ్ ఫిక్సింగ్..

ఫహీం ఆఫ్రఫ్ 2, నసీం 2, జమామ్ ఖాన్ 8, ఇన్షానుల్లా 6 పరుగులు చేశారు. ఆఫ్ఘాన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫరూకీ, ముజీబ్ వుర్ రహీమ్, మహ్మద్ నవీ రెండేసీ వికెట్లు తీశారు. ఆఫ్ఘాన్ టీ20 కెప్టెన్ రషీద్ ఖాన్ ఓ వికెట్ తీయగా అజ్మతుల్లా, నవీన్ ఉల్ హక్ లకే చెరో వికెట్ దక్కాయి. ఈ లక్ష్యాపన్ని 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆఫ్ఘానిస్తాన్ ఛేదించింది. గుల్భాద్దీన్ నైట్ డకౌట్ అయినా రహ్మనుల్లా గుర్భాజ్ 17 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్స్ తో 16 పరుగులు చేశాడు. ఇబ్రహీం జార్డాన్ 11 బంతుల్లో 9 పరుగులు చేశాడు. కరీం జనత్ 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మహ్మద్ నబీ 38 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్ తో 38 పరుగులు చేయగా నజీబుల్లా జార్డా్ 23 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు చేశాడు. ఈ సిరీస్ లో రెండో టీ20 ఆదివారం, మార్చ్ 26న, ఆఖరి మ్యాచ్ సోమవారం మార్చ్ 27న జరుగబోతుంది.