Site icon NTV Telugu

 Afghanistan: భారీ కుట్ర భగ్నం..! పాకిస్థాన్ నుంచి భారత్‌కి ఉగ్రవాది.. అరెస్ట్ చేసిన తాలిబన్లు..!

Terrorist

Terrorist

Afghanistan: ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల మధ్య ఇప్పటికే సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇటీవల ఇరు దేశాల మధ్య జరిగిన అశాంతి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యాంశాల్లో నిలిచింది. పాకిస్థాన్ వైమానిక దాడులకు ప్రతిస్పందనగా, ఆఫ్ఘనిస్థాన్ పాక్ దళాలపై పెద్ద ఎత్తున విరుచుకుపడింది. తాజాగా రెండు దేశాలు ఇప్పటికీ దీర్ఘకాలిక కాల్పుల విరమణ కోసం చర్చలు జరుగుతున్నాయి. ఇంతలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. తాలిబన్లు లష్కరే తోయిబా శిబిరంలో పెరిగిన ఓ చొరబాటుదారుడిని అరెస్టు చేశారు.

READ MORE: Montha Cyclone: తుఫాన్ ప్రభావం.. తెలంగాణలో పంట నష్టం లిస్ట్ ఇదే..

నివేదికల ప్రకారం.. పాకిస్థాన్ నుంచి ఆఫ్ఘన్ తాలిబన్ ప్రభుత్వం పట్టుకున్న ఉగ్రవాది ఐసిస్ విభాగమైన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. అయితే.. ఆ ఉగ్రవాది భారత్‌లో భారీ కుట్ర పన్నాడు. భారత్‌లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి సిద్ధమయ్యాడు. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే పాకిస్థాన్ ‌లోని లష్కరే తోయిబా శిబిరంలోనే తాను శిక్షణ పొందానని ఉగ్రవాది స్వయంగా వెల్లడించాడని తాలిబన్ ప్రభుత్వం పేర్కొంది. ఈ సంఘటన మరోసారి పాకిస్థాన్ సిగ్గుమాలిన ఎజెండాను స్పష్టంగా ప్రదర్శించింది. పట్టుబడిన తాలిబన్ ఉగ్రవాది పేరు సైదుల్లా. లష్కర్ శిబిరంలో కఠినమైన శిక్షణ పొందాడు. అనంతరం వాడి పేరును మొహమ్మద్ గా మార్చారు. భారత్‌లో లష్కర్ కార్యకర్తలు చేసే దాడుల మాదిరిగానే ఉగ్రవాద దాడులను చొరబడి నిర్వహించడానికి అతన్ని ఆఫ్ఘనిస్థాన్ నుంచి పాకిస్థాన్ ‌కు పంపారు.

READ MORE: Montha Cyclone: తుఫాన్ ప్రభావం.. తెలంగాణలో పంట నష్టం లిస్ట్ ఇదే..

కాగా.. గత కొన్ని సంవత్సరాలుగా భారత ఏజెన్సీలు ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా అనేక మంది ISKP మాడ్యూల్ ఉగ్రవాదులను అరెస్టు చేశాయని గమనించాలి. ISKP వెనుక పాకిస్థాన్ నిఘా సంస్థ ఉందని భారత ఏజెన్సీ వర్గాలు గతంలో వెల్లడించాయి. తాజాగా తాలిబన్ల ప్రకటన దీనిని మరోసారి స్పష్టం చేసింది. పాకిస్థాన్ ఎప్పుడూ ప్రత్యక్ష దాడి చేయదు. మన దేశంతో పోరాడే సత్తాదానికి లేదు. భారత సైన్యం చేతిలో ఓడిపోయి.. తాలిబన్ యోధుల చేతిలో దెబ్బతిని యుద్ధభూమిలో పరాజయాలను చవిచూసింది. దీంతో ఉగ్రవాదాన్ని మన దేశంపైకి ఉసిగొలుపుతోంది.

Exit mobile version