NTV Telugu Site icon

Tata Punch EV: టాటా నుంచి త్వరలో చీపెస్ట్ ఎలక్ట్రిక్ SUV

Tata Motors

Tata Motors

టాటా మోటార్స్ ఈవీ సెగ్మెంట్ తన తదుపరి ఎలక్ట్రిక్ కారును త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. జనవరి 2024 చివరి వారంలో టాటా పంచ్ ఈవీని భారత్ లో విడుదల చేయనున్నట్లు తెలిసింది. పంచ్ ఈవీ మార్కెట్‌లో సిట్రోయెన్ eC3కి ప్రత్యక్ష పోటీదారుగా ఉంటుంది. ఇది బహుశా దేశంలోనే అత్యంత చీపెస్ట్ ధరకు వస్తున్న ఎలక్ట్రిక్ SUV కారు అని చెప్పొచ్చు.. సిట్రోయెన్ eC3 ప్రస్తుతం ధర రూ. 11.61 లక్షలు మొదలుకొని రూ. 12.79 లక్షలుగా నిర్ణయించారు. టాటా పంచ్ దీని కంటే తక్కువ ధరలో అంటే రూ.11 లక్షలలోపు విడుదల చేయాలని భావిస్తుంది.

Read Also: Chennai Super Kings: ఎంఎస్ ధోనీ వారసుడి కోసం పదేళ్లుగా అన్వేషిస్తున్నాం!

ప్రస్తుత సమాచారం ప్రకారం.. ట్రీగో ఈవీలలో ఉన్న 24కే వాట్స్ యూనిట్‌తో పోలిస్తే ఇది కొంచెం పెద్ద బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. అలాగే, పంచ్ ఈవీలో ఛార్జింగ్ సాకెట్ ముందు భాగంలో అందించబడింది. ఇందులో అల్లాయ్ వీల్స్ కూడా ఉండే అవకాశం ఉంది. టాటా పంచ్ ఈవీ ఐసీఈ పంచ్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, ఆర్కెడ్.ఈవీ (Arcade.ev) యాప్ సూట్‌తో సహా కొన్ని అదనపు ఫీచర్లను పొందుపర్చారు. నెక్సాన్, నెక్సాన్ ఈవీలో కనిపించే విధంగా ప్రకాశవంతమైన టాటా మోటార్స్ లోగోతో కూడిన స్పోక్ స్టీరింగ్ వీల్ అందించబడే అవకాశం ఉంది.

Read Also: Breaking: జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల

ఇది కాకుండా, క్యాబిన్ లోపలి భాగం అప్‌డేట్ చేయబడిన నెక్సాన్ మాదిరిగానే 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో సహా అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉండే ఛాన్స్ ఉంది. టాటా పంచ్ ఈవీ ధర గురించి టాటా కంపెనీ ఎక్కడా ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే ఇంధనంతో నడిచే కారుతో పోలిస్తే ధర కాస్త ఎక్కువగానే ఉండే ఛాన్స్ ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలతో దాదాపు 350 కిలో మీటర్ల ప్రయాణం చేసే అవకాశం ఉంది.