Site icon NTV Telugu

Advocate Murder : అడ్వకేట్ ఇజ్రాయిల్ హత్య కేసులో వీడిన మిస్టరీ

Murder

Murder

Advocate Murder : హైదరాబాద్‌ నగరంలో సంచలనం రేపిన న్యాయవాది ఇజ్రాయిల్‌ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. న్యాయవాదిని దారుణంగా హత్య చేసిన వ్యక్తిగా వాచ్ మెన్ దస్తగిరిని అరెస్టు చేశారు. ఈ కేసు వెనుక వ్యక్తిగత కారణాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. చంపపేటలో వాచ్ మెన్‌గా పనిచేస్తున్న కాంతారావు, దస్తగిరిలలో గత కొంతకాలంగా వివాదం నెలకొని ఉంది. ఈ వివాదానికి కారణం కాంతారావు భార్య కళ్యాణి. దస్తగిరి మరియు కళ్యాణి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు పోలీసులు తేల్చారు. అయితే, ఈ వ్యవహారాన్ని అడ్వకేట్ ఇజ్రాయిల్ గమనించి కళ్యాణిని హెచ్చరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

 GT vs PBKS: టాస్ గెలిచిన గుజరాత్.. తుది జట్లు ఇవే!

కళ్యాణి తనను వేధిస్తున్నాడంటూ న్యాయవాదికి ఫిర్యాదు చేయడంతో ఇజ్రాయిల్ పోలీసులకు దస్తగిరిపై కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు దస్తగిరిని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి, కళ్యాణిని కలవొద్దని హెచ్చరించారు. దీంతో కోపంతో రగిలిపోయిన దస్తగిరి, పది రోజులపాటు రెక్కీ నిర్వహించి, సమయం చూసి న్యాయవాదిని దారుణంగా హత్య చేశాడు. పోలీసుల దర్యాప్తులో దస్తగిరి హత్యను అంగీకరించాడు. ఎలక్ట్రీషియన్‌గా కూడా పని చేస్తున్న అతను హత్య కోసం ముందుగా ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. ఈ హత్య కేసు వెలుగులోకి రావడంతో నగరవాసుల్లో భయం పెరిగింది. ప్రస్తుతం దస్తగిరిని అదుపులోకి తీసుకుని పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు.

Ishan Kishan: సన్‌రైజర్స్ జట్టులో తన కెరీర్‌ను మెరుగుపర్చుకోవచ్చు..

Exit mobile version