Atreyapuram Pootharekulu: ఆత్రేయపురం కల్తీ నెయ్యి ఘటన.. ల్యాబ్ పరిశీలనలో వెలుగులోకి కీలక వాస్తవాలు!
- ల్యాబ్ పరిశీలనలో వాస్తవాలు వెల్లడి
- పూతరేకుల దుకాణాల్లో వాడింది కల్తీ నెయ్యే
- కేసులు నమోదు చేస్తామని అధికారుల హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలోని కొన్ని పూతరేకుల దుకాణాల్లో వాడింది కల్తీ నెయ్యేనని నిర్ధారణ అయింది. హైదరాబాద్‌కు పంపిన శాంపిల్స్ ల్యాబ్ పరిశీలనలో వాస్తవాలు వెల్లడయ్యాయి. దాంతో ఆత్రేయపురంలోని కొన్ని పూతరేకుల దుకాణాల్లో నాణ్యతలేని వెయ్యి వాడుతున్నట్లు తేలిపోయింది. గత నెల ఆహార భద్రత అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో లూజు నెయ్యి ప్యాకెట్లు, బ్రాండ్ లేని నెయ్యి నమూనాలను గుర్తించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అర్జించాలన్న అత్యాశలతో కొందరు నాణ్యత లేని నెయ్యి వాడుతున్నట్లు అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు.
ఫిబ్రవరి 17న ఆహార తనిఖీ అధికారులు నాలుగు బృందాలుగా చేసిన తనికీల్లో ఆత్రేయపురం పూతరేకులు దుకాణాల్లో ముద్రితం లేని 160 కిలోల నెయ్యి స్వాధీవం చేసుకున్నారు. అనుమానం రావడంతో పలుచోట్ల 8 నమూనాలు సేకరించారు. వీటిని పరీక్ష కోసం హైదరాబాద్‌లోని ప్రయోగశాలకు పంపారు. ఈ ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. ఇందులో మూడు నమూనాల్లో కల్తీ జరిగినట్లు ల్యాబ్ పరీక్షల్లో గుర్తించారు. ఈ మేరకు ఆహర భద్రత అధికారి బి.శ్రీనివాస్ కల్తీ నెయ్యి వినియోగిస్తున్న పూతరేకుల దుకాణదారులకు నోటీసులు జారీ చేశారు. ఇకపై నెయ్యి తయారీ తేదీ లేకపోయినా, లైసెన్స్ లేకుండా దుకాణాలు నడిపినా కేసులు నమోదు చేస్తామని ఆహార భద్రత అధికారులు హెచ్చరించారు.
Also Read
- Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్‌గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
- Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
- Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
- Virat Kohli: "ప్రతి సీజన్‌ను నరకంలా అనుభవించాను".. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
తాజావార్తలు
-
Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్‌గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
-
Peddi : ‘పెద్ది’ కోసం జాన్వీ రిస్క్..
-
Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
-
Ramcharan : రామ్ చరణ్ చేతికి గాయం?..అసలు ఏమైంది?
-
Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..