డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ 2 సినిమా గత సంవత్సరం విడుదల అయి మంచి విజయం సాధించింది.ఆ చిత్రంలో కీలక రోల్ చేసిన డాగ్.. మాక్స్ (Max) గురించి అందరికీ తెలిసిందే. ఈ డాగ్ బెల్జియన్ మాలినోయిస్ బ్రీడ్ కు చెందినదీ.దాని అసలు పేరు సాషా.తాజాగా సాషా తీవ్ర జర్వంతో కన్నుమూసింది.. సాషా మరణించడంతో నివాళి అర్పిస్తూ అడివి శేషు ఎమోషనల్ పోస్టు పెట్టారు. సాషా మరణ వార్త విని అడివి శేష్ ఎంతో ఎమోషనల్ అయ్యారు.. ఈ సందర్భంగా ఎమోషనల్ నోట్ ను రాసుకొచ్చారు. ‘ జ్వరం ఎక్కువగా రావడం కారణంగా సాషా మరణించింది. ఈ వార్తను చెప్పేందుకు ఎంతో బాధగా ఉంది.సాషా హిట్ 2 సినిమాలో మాక్స్ (Max) పాత్రను పోషించింది. తీవ్రంగా జ్వరం రావడంతో వెంటనే మేము హాస్పిటల్ కి తీసుకెళ్లాం.మా మాక్స్ తిరిగి కోలుకుంటుందని ఎంతగానో ఆశించాం. కానీ మా మాక్స్ మా అందరినీ విడిచి వెళ్ళిపోయింది.. ఎంతో కష్టతరం అయిన షూట్ లో కూడా బేబీ గర్ల్ (సాషా) నువ్వు మమ్మల్ని సహించినందుకు నీకు ధన్యవాదాలు. నువ్వు మా అందరికీ ఎంతో సంతోషానిచ్చావు. సాషా శిక్షకుడు ఆనంద్‌కు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.’ అంటూ అడివి శేష్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట బాగా వైరల్ గా మారింది.
‘హిట్2’లో మాక్స్ పాత్రలో కనిపించిన సాషా సన్నివేశాలు ఎంతోఅద్భుతంగా ఉంటాయి.మాక్స్ పాత్ర సినిమాకు ఎంతో కీలకం.దీంతో అందరికీ మాక్స్ పాత్ర ఎప్పటికి గుర్తుండిపోతుంది.హిట్ సినిమాకు రెండవ భాగంగా హిట్ 2 ను డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించారు.. ఈ సినిమాలో అడివిశేష్ మరియు మీనాక్షి చౌదరి జంటగా నటించారు. నాని ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహారించారు.హిట్ 3 చిత్రాన్ని కూడా తీసుకురాబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. ప్రస్తుతం శైలేష్ వెంకటేష్ తో చేస్తున్న ‘సైంధవ్’ సినిమాతో బిజీ గా వున్నారు. ఆ సినిమా తరువాత శైలేష్ హిట్3 సినిమాని తెరకెక్కిస్తారు.. హిట్ 3 లో నాని మూడో కేసును చేధించబోతున్నారు.నాని పాత్ర ఈ సినిమాలో కొంత డిఫరెంట్ గా ఉండబోతుందని సమాచారం.
https://twitter.com/AdiviSesh/status/1679564900455317504?s=20