Adivi Sesh: టాలీవుడ్ లో మరో పెళ్లి బాజా మోగబోతుంది.. అతడెవరో కాదు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ అయిన హీరో అడవి శేషు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను పెళ్లి చేసుకోబోతున్నది మరెవరినో కాదు అక్కినేని సుప్రియ. ఈమె స్వయానా అక్కినేని నాగార్జునకు మేనకోడలు. అడవి శేష్, సుప్రియ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని కూడా వార్తలు వినిపించాయి. నిజానికి ఈ జంట ఎప్పుడో పెళ్లి చేసుకోవాల్సింది. అడివి శేష్ ఇంట్లో వాళ్లు సుప్రియతో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇన్ని రోజులు వాయిదా పడిందట. ప్రస్తుతం వారు పెళ్ళికి ఓకే చెప్పారని.. అందుకే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
Read Also: Megha Parmar: మేఘా పర్మార్‌ను అంబాసిడర్‌గా తొలగించిన ఎంపీ సర్కారు
అడివి శేష్ ఏదైనా పండగ జరిగిన ఈవెంట్ జరిగినా కూడా ఎక్కువగా అక్కినేని ఫ్యామిలీతో కలిసి పోతున్నారు. అలాగే అక్కినేని ఫ్యామిలీలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని సుప్రియ పక్కనే కూర్చున్నారు. ఇక ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో అప్పట్లో చక్కర్లు కొట్టాయి. అంతే కాకుండా రామ్ చరణ్ బర్త్ డే రోజు సుప్రియ అడివి శేష్ ఇద్దరూ ఒకే కారులో వచ్చి మీడియా కంట పడ్డారు. ఇలా ఎక్కడికి వెళ్లినా కూడా వీళ్ళిద్దరూ జంటగా వెళ్లడంతో త్వరలోనే వీళ్ళ పెళ్లి ఖాయమంటూ అందరూ భావించారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం అక్కినేని నాగచైతన్య అడివి శేష్ సుప్రియల పెళ్లికి పెద్దగా వ్యవహరిస్తున్నారట. వీరిద్దరి పెళ్లి విషయాన్ని ఇటు అక్కినేని ఫ్యామిలీలో అలాగే అటు ఫ్యామిలీలో పెద్దలను ఒప్పించి పెళ్లి చేయబోతున్నారట. సమాచారం ప్రకారం వీరి పెళ్లి జూన్ 16న జరగబోతుందని తెలుస్తోంది. అయితే ఇదే నిజమైతే మరో ప్రేమ జంట కూడా ఒక్కటి కాబోతున్నట్లే.
Read Also: SRH vs RCB: విరాట్ విశ్వరూపం.. నాల్గో స్థానానికి ఆర్సీబీ
