అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి చేదు అనుభవం ఎదురైంది. జీవో నం.52 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే ను అడ్డుకున్నారు ఆదివాసీ నాయకులు….బోయ వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీలలో చేరుస్తూ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన గిరిజనులు నినాదాలు చేశారు. జీవో ను రద్దు చేయించలేని ఎమ్మెల్యేలు గిరిజన ద్రోహులంటూ నినదించారు ఆదివాసీలు…టీడీపీకి రాజీనామా చేసి రండి మీకు న్యాయం చేస్తా అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. గిరిజనులకు అన్యాయం చేసే జీవో రద్దు చేయకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులు ఎవరైనా తమ వర్గ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయాలని ఆదివాసీ సంఘాల నేతలు ఎమ్మెల్యేకు సూచించారు.
Media error: Format(s) not supported or source(s) not found
Download File: https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2023/04/WhatsApp-Video-2023-04-11-at-11.49.18-AM.mp4?_=1Read Also: live life comfortably: ఆ దేశంలో అన్నీ ఉచితమే.. జీవితాన్ని హాయిగా గడపండి
మరోవైపు ఆదివాసీ సంఘాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఆదివాసీ , గిరిజన నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. రంపచోడవరం లో ఏర్పాటుచేసిన 3 వ విడత వై ఎస్ ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొనే ఎమ్మెల్యే ధనలక్ష్మి ని అడ్డుకుంటారనే నేపథ్యంతో ఆదివాసీ గిరిజన సంఘల నాయకులను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. G.0. నెo 52 ని రద్దు చేయాలని డిమాండు గత కొద్దిరోజులుగా ఆదివాసీలు ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనలో భాగంగా ఎమ్మెల్యే ధనలక్ష్మిని అడ్డుకోవడం జరుగుతుంది. ఈనేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు రంపచోడవరం ఐటిడిఎ పరిధిలో ఏడు మండలాలల్లోని ఆదివాసీ, గిరిజన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.