Aditya Dhar: లెజెండ్ ప్రభాస్ “స్పిరిట్” సినిమా కోసం వేచి చూస్తున్నా.. “ధురంధర్” డైరెక్టర్ ఆదిత్యధర్
- ధురంధర్ సినిమా దర్శకుడు ఆదిత్యధర్ ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు..
- ప్రభాస్‌ను “లెజెండ్”గా కొనియాడిన దర్శకుడు
- స్పిరిట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వ్యాఖ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aditya Dhar: ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్: ది రివేంజ్’ సినిమాతో సంచలనం సృష్టిస్తున్న దర్శకుడు ఆదిత్యధర్, రెబల్ స్టార్ ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్‌ను ‘లెజెండ్’ అని సంబోధిస్తూ.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమా కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చాడు.
Also Read
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
‘ధురంధర్’ సినిమాపై బాలీవుడ్‌లో వస్తున్న ‘ప్రాపగండా’ విమర్శలను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గట్టిగా తిప్పికొట్టారు. నిజాయితీగా తీసిన సినిమాపై ఇలాంటి విష ప్రచారం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. దీనికి స్పందించిన ఆదిత్యధర్.. తన అభిప్రాయాలపై బలంగా నిలబడే సందీప్ వంగా అందరికీ స్ఫూర్తి అని కొనియాడారు. ఇదే క్రమంలో, “లెజెండ్ ప్రభాస్ గారికి నా ప్రేమను తెలియజేయండి.. థియేటర్లలో ‘స్పిరిట్’ విధ్వంసాన్ని చూడాలని వెయిట్ చేస్తున్నాను” అంటూ రిప్లై ఇచ్చారు.
ప్రభాస్‌ను ఉద్దేశించి ఆదిత్య ధార్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ యాక్షన్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఆదిత్య ధార్, గ్లోబల్ స్టార్ ప్రభాస్‌తో గనుక సినిమా చేస్తే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ అప్పుడే అంచనాలు మొదలుపెట్టారు కూడా. చూడాలి మరి ఫ్యూచర్ లో అది సాధ్యమవుతుందేమో..
ఇకపోతే ధురంధర్ విషయానికి వెళ్తే.. భారతదేశ గూఢచారి వ్యవస్థలోని లోతుపాతులను, దేశభక్తిని, ప్రతీకారాన్ని అద్భుతమైన యాక్షన్ డ్రామాగా మలిచిన చిత్రం ‘ధురంధర్: ది రివేంజ్’. గతంలో ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ వంటి భారీ విజయాన్ని అందించిన ఆదిత్యధర్, ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక విలువల తో తెరకెక్కించారు. భారీ తారాగణం, ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లే తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా 1680 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేస్తూ రికారాదులను తిరగరాస్తుంది.
Mere Pyaare Sandeep,
I genuinely love the way you stand your ground and give it back when it matters. There’s a real honesty and belief in that and it’s something I truly respect.
I’ve always looked up to how you back your cinema without any doubt or noise.
That kind of…— Aditya Dhar (@AdityaDharFilms) April 9, 2026
తాజావార్తలు
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?