MLA Adinarayana Reddy: రాజీనామాపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Adinarayana Reddy: స్థానిక సంస్థల ఎన్నికల వేళ కడప జిల్లా కూటమిలో కుంపటి రేగింది.. జెడ్పీ చైర్మన్ పీఠం విషయంలో అలక వహించిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.. కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విచిత్రమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యం లేని పులివెందులకు తాను స్వయంగా వెళ్లి ప్రచారం చేశానని తెలిపారు. ఎన్నికల్లో ఐదు జడ్పీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నామని, 40 కౌన్సిలర్ స్థానాలకు గాను 37 స్థానాల్లో విజయం సాధించామని వెల్లడించారు. మొత్తంగా ఏడు జడ్పీటీసీ స్థానాలను గెలుచుకున్నామని పేర్కొన్నారు. తన తమ్ముళ్ల కుమారులను, యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి తీసుకొచ్చానని, అయితే రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడే వారికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ, ఎలా మోసం జరిగిందో పూర్తిస్థాయిలో తెలుసుకుంటానని చెప్పారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి వాస్తవాలు తెలుసుకున్న తర్వాత తన రాజీనామాపై నిర్ణయం ప్రకటిస్తానని స్పష్టం చేశారు.
తనకు ఎమ్మెల్యే పదవి కొత్త కాదని, ఇప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని ఆదినారాయణ రెడ్డి అన్నారు. రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవడం, మార్పులు చేసుకోవడం తనకు పెద్ద కష్టమేమీ కాదని వ్యాఖ్యానించారు. తాను బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి.. సమస్యలకు పరిష్కారం లభిస్తుందా లేదా అన్నది చూసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తనకు మంత్రి పదవులు అవసరం లేదని, ఎలాంటి ప్రత్యామ్నాయ పదవులు కూడా కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై శివప్రకాష్ జీ కూడా తనతో మాట్లాడారని వెల్లడించారు. టీడీపీ, బీజేపీ మధ్య సమన్వయ లోపం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.. తన సమస్యలకు పరిష్కారం లభిస్తుందా లేదా అన్నది పరిశీలించి రేపు ఉదయం ఒక ప్రకటన చేస్తానని ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు. దీంతో ఆయన రాజీనామా ప్రకటనపై కడప రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.
Also Read
- AP Panchayat Elections 2026: పంచాయతీ ఎన్నికల్లో కీలక మార్పులు.. పోలింగ్ కేంద్రాల విలీనంపై ఈసీ ఉత్తర్వులు
- AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు.. ఫేజ్-IIలో 25 వేల మందికి పైగా సర్పంచ్ అభ్యర్థులు
- Adinarayana Reddy: డోంట్ కేర్ మంత్రి పదవి.. మా పిల్లల రాజీనామాలు ఆగవు.. నా రాజీనామా ఢిల్లీలోనే..!
- Vijayawada Politics: విజయవాడ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారంపై రాజకీయ దుమారం
తాజావార్తలు
-
ASRB Recruitment 2026: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 1,393 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు రెడీ.. మంచి జీతం
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
Rishabh Pant : నాకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు.. ఈసారి దొరకలేదు.. పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Gold Loan Recovery: గోల్డ్ లోన్ తీసుకున్న వారికి షాక్.. గండం ముంచుకొస్తోంది!
-
Deputy CM Pawan Kalyan: రామాంజులు మృతిపై పవన్ ఆరా.. నాగులగుట్టపల్లి ఘటనపై కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!
-
Jacob Duffy: బ్యాట్‌తో కాదు.. బంతితో డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..!
-
Global Peace Honors: ‘గ్లోబల్ పీస్ హానర్స్’లో తారల సందడి.. సచిన్‌కు ప్రత్యేక గౌరవం..!
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!