Site icon NTV Telugu

Team India: టీమిండియా కోసం అడిడాస్ అదిరిపోయే జెర్సీలు..

Team India Jersy

Team India Jersy

మరో వారం రోజుల్లో వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌కు టీమిండియా కొత్త జెర్సీ విడుదలైంది. అఫిషియల్‌ కిట్ స్పాన్సర్ అడిడాస్‌ సంస్థనే టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా కూడా వ్యవహరిస్తుంది. నైక్ కంపెనీ తర్వాత కిట్ స్పాన్సరే జెర్సీని తయారు చేయడం ఇదే తొలిసారి. మూడు ఫార్మట్లకు చెందిన భారత జట్టు జెర్సీలను అడిడాస్‌ సంస్థ ఇవాళ సోషల్‌ మీడియా అకౌంట్ ద్వారా ఆవిష్కరించింది.

Also Read : 1st June changes: ఈరోజు నుండి దేశంలో వచ్చిన ఐదు ప్రధాన మార్పులివే

జెర్సీల ఆవిష్కరణకు సంబంధించి రూపొందించిన ప్రత్యేక యానిమేటెడ్‌ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. కాలర్‌ లేకుండా డార్క్‌ బ్లూ కలర్‌లో ఉండే జెర్సీ టీ20లకు.. లైట్‌ బ్లూ కలర్‌లో కాలర్‌తో ఉన్న జెర్సీని వన్డేలకు.. వైట్‌ కలర్‌ జెర్సీని టెస్ట్‌లకు టీమిండియా ఆటగాళ్లు వేసుకోనున్నారు. జూన్ 7న ఆస్ట్రేలియాతో ప్రారంభంకాబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా ఈ కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది.

Also Read : California: కుక్క కోసం లగ్జరీ ఇళ్లు.. ఎంత పెట్టి నిర్మించాడో.. తెలిస్తే షాకవ్వాల్సిందే

పురుషుల క్రికెట్‌తో పాటు మహిళల క్రికెట్‌లోనూ భారత ఆటగాళ్లు ఇవే జెర్సీలు ధరించనున్నారు. బైజూస్ సంస్థ బీసీసీఐతో ఉన్న కాంట్రాక్ట్‌ను అర్ధంతరంగా క్యాన్సిల్ చేసుకోవడంతో అడిడాస్‌ కంపెనీ తప్పనిసరి పరిస్థితుల్లో జెర్సీ స్పాన్సర్‌గా కూడా వ్యవహరించాల్సి వచ్చింది. ఈ ఆవిష్కరణ మునుపెన్నడూ లేనంతగా వినూత్న రీతిలో సాగింది. ముంబయి వాంఖెడే స్టేడియంపైన మూడు భారీ జెర్సీలు ఆకాశం నుంచి వేళ్లాడుతున్నట్టుగా ఏర్పాటు చేశారు. అందుకోసం డ్రోన్లను వినియోగించారు. దీనికి సంబంధించిన వీడియోను అడిడాస్ తమ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. కాగా, ప్రస్తుతం విడుదల చేసిన జెర్సీలు… టీమిండియా నూతన కిట్ కు గ్లింప్స్ మాత్రమే. త్వరలోనే పూర్తిస్థాయి కిట్ ను అడిడాస్ ఆవిష్కరించనుంది.

Exit mobile version