NTV Telugu Site icon

Addanki Dayakar Rao : కడియం శ్రీహరి, రాజయ్యలు ఇద్దరూ శ్రీకృష్ణులే…

Addanki Dayakar

Addanki Dayakar

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో నేడు కాంగ్రెస్‌ విజయ భేరి నిర్వహించారు. ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కడియం శ్రీహరి, రాజయ్య లు ఇద్దరు శ్రీకృష్ణులే అని ఆయన అన్నారు. మీ చెల్లే సుభద్ర ను గెలిపించాల్సిన బాధ్యత మీదే అని ఆయన అన్నారు. దోచుకున్న సొమ్ముతో దొంగలు మళ్లీ మీ ముందుకు వస్తున్నారని, ప్రజల్ని దోచుకునేది బిఆర్ఎస్ అయితే… ప్రజలను కాపాడుకునేది కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రవళిక చనిపోతే పరామర్శించడం చేతకాదు కానీ… కాంగ్రెస్ నుండి అలిగిన పొన్నాల లక్ష్మయ్యను పరామర్శించడం తెలుసు అని ఆయన అన్నారు. విద్యార్థులకు ఉద్యోగాలు లేవు.. ఉద్యోగులకు ప్రమోషన్లు లేవని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఇవ్వడమే కాకుండా, ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తామన్నారు అద్దంకి దయాకర్‌ రావు.

Also Read : Team India: టీమిండియా టాస్ గెలిస్తే ఏం చేయాలి..? మాజీ క్రికెటర్ సలహా

మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే… నిజాం పాలన చూడాల్సి వస్తుందన్నారు అద్దంకి దయాకర్‌ రావు. తెలంగాణకు భరోసా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అని, ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటదన్నారు. వేయి ఎకరాల్లో అయ్యా కొడుకుల ఫాంహౌస్ లు కట్టుకున్నారు.టీవీలు పేపర్లు పెట్టుకున్న కేసీఆర్ చదువుకున్నోళ్ళకు ఉద్యోగాలు ఇయ్యలేదని అన్నారు. ఆరూరి వరంగల్ ను అక్రమంగా ఆక్రమించుకుని బిల్డింగ్ లు కడితే వరంగల్ నగరం మునిగింది.ఇండ్ల దగ్గర బీఆర్ఎస్ వాడు ఇచ్చే కరెంట్ బిల్లు చూస్తే షాక్ పేదలకు కరెంట్ షాక్ తగిలినంత పనైతుందని.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పేదవాడికి 200 యూనిట్లు ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు.

Also Read : Unstoppable with NBK : బాలకృష్ణతో రణ్‍బీర్ కపూర్.. వైరల్ అవుతున్న ఫొటో..