Unstoppable with NBK : బాలకృష్ణతో రణ్‍బీర్ కపూర్.. వైరల్ అవుతున్న ఫొటో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‍స్టాపబుల్ షోకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.ఇటీవల అన్‍స్టాపబుల్ మూడో సీజన్ కూడా షురూ అయింది.లిమిటెడ్ ఎడిషన్ పేరుతో ఈ సీజన్ వచ్చింది. ఇక, ఈ అన్‍స్టాపబుల్ టాక్ షో కు మొదటి సారి బాలీవుడ్ హీరో రాబోతున్నారు.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ అన్‍స్టాపబుల్ టాక్ షో లో బాలయ్య తో కలిసి సందడి చేయనున్నారు.. పాన్ ఇండియా ఎపిసోడ్ త్వరలోనే రాబోతుంది వేచి ఉండండి అంటూ ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఇటీవల ప్రకటించింది.. ఈ ఎపిసోడ్‍కు సంబంధించిన షూటింగ్ నేడు జరిగినట్టు తెలుస్తోంది.యానిమల్ సినిమా ప్రమోషన్స్ కోసం హీరో రణ్‍బీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్న మరియు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అన్‍స్టాపబుల్ షో కు వస్తున్నట్లు కొంతకాలంగా న్యూస్ తెగ వైరల్ అవుతుంది. రీసెంట్ గా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ కూడా ఈ న్యూస్ ని కన్ఫార్మ్ చేసింది.
అన్‍స్టాపబుల్ పాన్ ఇండియా ఎపిసోడ్ త్వరలోనే వచ్చేస్తోందంటూ ప్రేక్షకులను ఊరిస్తోంది. తాజాగా ఈ ఎపిసోడ్ షూటింగ్‍లో యానిమల్ మూవీ టీమ్ పాల్గొంది.అన్‍స్టాపబుల్ షూటింగ్ కోసం రణ్‍బీర్ కపూర్ నేడే హైదరాబాద్ వచ్చారు. అన్‍స్టాపబుల్ సెట్స్‌కు వెళ్లారు. షూటింగ్‍లో కూడా పాల్గొన్నారు. కాగా, హోస్ట్ బాలకృష్ణతో రణ్‍బీర్ కలిసి దిగిన ఫొటో ఒకటి బయటికి వచ్చింది.. రణ్‍బీర్ కపూర్ బ్రౌన్ చెక్డ్ షర్ట్, లోపల వైట్ టీషర్ట్ ను ధరించారు. అన్‍స్టాపబుల్ హోస్ట్ బాలకృష్ణ బ్లాక్ షర్టుపై బ్లాక్ బ్లేజర్ వేసుకున్నారు.బాలకృష్ణతో రణ్‍బీర్ కపూర్ ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లయన్ మీట్స్ యానిమల్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. రణ్ బీర్ నటించిన యానిమల్ సినిమా డిసెంబర్ 1వ తేదీన విడుదల కానుంది. అర్జున్ రెడ్డి వంటి బిగ్గెస్ట్ హిట్ అందించిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాకు తెలుగులో కూడా భారీగా క్రేజ్ ఏర్పడింది.తెలుగులో యానిమల్ సినిమాను మరింత ప్రమోట్ చేసేందుకు అన్‍స్టాపబుల్‍కు యానిమల్ టీమ్ వచ్చింది.
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
తాజావార్తలు
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!