Site icon NTV Telugu

Addanki Dayakar Rao : రెండు పార్టీల డ్రామాలకు అంతం లేకుండా పోయింది

Addanki Dayakar

Addanki Dayakar

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ లు రోజుకు డ్రామా ఆడుతున్నాయని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు పార్టీల డ్రామాలకు అంతం లేకుండా పోయిందని, లిక్కర్ డ్రామా లో బిజెపి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందన్నారు. మోడీ, అమిత్ షా ల ముద్దు బిడ్డ కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న పార్టీలపై నేతలపై దాడి చేస్తుంది బీజేపీ అని ఆయన మండిపడ్డారు. ప్రతిదీ తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నమని, బీజేపీతో జోడీ కట్టి బీఆర్‌ఎస్‌ అంతర్థానం అయ్యే పరిస్ఠితి వచ్చిందన్నారు దయాకర్‌ రావు. కవిత రూపంలో బీఆర్‌ఎస్‌ను బీజేపీ బెదిరిస్తుందన్నారు. కవితకు నోటీసులు ఇస్తున్నారు కరెక్టేనని, ఎందుకు లెఫ్టినెంట్ గవర్నర్ ను కేసు నుంచి తప్పించారన్నారు. మా అలయెన్స్ ను విచ్ఛిన్నం చేసే కుట్ర బిజెపి చేస్తోందన్నారు. కవితకు నోటీసు ఇచ్చారని, అయితే కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తున్నారన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ బలపడేందుకు కుట్ర చేస్తున్నారని, కవిత అరెస్ట్ పేరుతో గతంలోనూ హైడ్రామా చేశారన్నారు. కిషన్ రెడ్డి కేసీఆర్ కు అనుకూలంగా ఉంటారు.

Star Heroine: స్టార్ హీరోయిన్ తో డైరెక్టర్ గొడవ.. దండం పెట్టిన నిర్మాత..?

అందుకే బండి సంజయ్ ను మార్చారన్నారు. హేమంత్ సోరెన్ కూడా దర్యాప్తు సంస్థలకు లేఖ రాశారని, సోనియా, రాహుల్ లను కూడా దర్యాప్తు సంస్థలు వదలేదన్నారు దయాకర్‌ రావు. లేఖ రాయగానే, కవితకు ఎలా సాధ్యం అవుతుందని, నిజమైన అవినీతి పరులను దాస్తున్నారన్నారు. కేసీఆర్ పై ఎందుకు కేంద్రం చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ను కాపాడింది బీజేపీనేనని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుంగతుర్తి టికెట్ మాత్రమే అడిగానన్నారు. తర్వాత మళ్లీ నేను పార్టీని ఏం అడగలేదని, పార్టీ నిర్ణయమే నాకు శిరోధార్యమన్నారు అద్దండి దయాకర్‌ రావు. కాంగ్రెస్ అమ్ముల పొదలో అద్దంకి దయాకర్ ఆయుధమని, కాంగ్రెస్ నాకు మంచి అవకాశం ఇస్తుందన్నారు. పార్టీ ఎలా వినియోగించుకున్నా నేను ఉపయోగపడేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.

 

Exit mobile version