NTV Telugu Site icon

Addanki Dayakar : కేటీఆర్‌కు చట్టం, న్యాయం ఎందుకు కనిపియ్యలేదు

Addanki Dayakar

Addanki Dayakar

కేటీఆర్ కేసీఆర్ కాపాడుకోలేక పోతున్న నాయకులను తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ తీసుకుంటుందని, వాళ్ళను ఆపడానికి చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే నవ్వు వస్తుందన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలలో బీఆర్ఎస్ సరైన పద్ధతిని పాటించలేదని, కేసీఆర్ వల్లనే రాష్ట్రంలో ఈ పరిస్థితులు వచ్చినవన్నారు అద్దంకి దయాకర్‌. పార్టీ ఫిరాయింపుల అనేవి కేవలం తెలంగాణలోనే కాదు దేశంలోనే ఒక తంతుగా మారిందని, టీడీఎల్పీని, సీఎల్పీని మెడ్జి చేసుకున్నప్పుడు వాళ్లకు కేటీఆర్ కు,కేసీఆర్ కు సిగ్గు అనిపించ లేదా అని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ కు చట్టం ,న్యాయం ఎందుకు కనిపియ్యలేదని, రాజకీయాలలో మీకోక న్యాయం,ఇతరులకు ఇంకో న్యాయం ఉండదని, చట్ట పరమైన అంశాలను కాంగ్రెస్ ప్రభుత్వం ధీటుగా ఎదుర్కోగలదన్నారు అద్దంకి దయాకర్‌.

Kannappa: ‘కన్నప్ప’లో ముండడుగా దేవరాజ్.. లుక్ రిలీజ్

ఫిరాయింపులు తెలంగాణలోనే కాదని.. దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయని అన్నారు. కేవలం కేసీఆర్ కారణంగానే రాష్ట్రంలో ఈ పరిస్థితులు వచ్చాయని తెలిపారు. రాజకీయాల్లో బీఆర్ఎస్‌కో న్యాయం.. కాంగ్రెస్‌కో న్యాయమా? అని ప్రశ్నించారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దాదాపు ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు చేరికకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతూ వస్తున్నారన్నారు.

AP CM Chandrababu: ఏపీ యువతకు ఉద్యోగాలు లభించేలా నైపుణ్యాభివృద్ధి పెంచాలి..

Show comments