Addanki Dayakar : పుష్ప 2 ప్రీమియర్ తొక్కిసలాటలో మహిళ మృతి కేసులో ఐకాన్ స్టార్ అర్జున్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై సినీ, రాజకీయ ప్రముఖలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. చట్టం తనపని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంల కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారని, చట్టం తన పని తాను చేసుకొని పోతుందని, అల్లు అర్జున్ ప్రమేయం ఉన్నది కాబట్టే అరెస్టు జరిగిందన్నారు.
Minister Seethakka : గత ప్రభుత్వం బాసర ట్రిపుల్ ఐటీని ట్రబుల్ ఐటీగా మార్చింది
సీఎం కానీ పోలీసులు కానీ చట్టం ప్రకారం ముందుకు వెళ్తారు తప్ప చట్టం చేతులోకి తీసుకోరన్నారు అద్దంకి దయాకర్. కేటీఆర్, హరీష్ ఈ విషయంలో ప్రభుత్వంపై బురుద చల్లుతున్నారని, ఈ విషయంలో రాజకీయం అనవసరమన్నారని, అందరికీ ఒకే విధమైన న్యాయం ఉంటుందన్నారు అద్దంకి దయాకర్. మన తెలుగు సినిమా ముందుకు వెళ్తుంది కాబట్టి బెన్ఫిట్ షోకి అనుమతి ఇచ్చిందని, కేటీఆర్ మా సీఎం సైకో రాం అన్నాడు కానీ అతను.. కేటీఆర్ హరీష్ రావు స్పందిస్తున్నారు కానీ కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు.. అందరూ కూడా సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు అద్దంకి దయాకర్‌జ
Minister BC Janardhan Reddy: సంక్రాంతి నాటికి గుంతల రహిత రహదారులే లక్ష్యం