Site icon NTV Telugu

Addanki Dayakar : హైడ్రా, మూసీ విషయంలో ప్రజలకు నష్టం చేయాలని ప్రభుత్వానికి లేదు

Addanki Dayakar

Addanki Dayakar

హైడ్రా కు సంబంధించి హై కోర్టు, సుప్రీంకోర్టు ఉందని, కస్టోడీయన్‌గా ప్రభుత్వం కూడా ఆస్తులకు రక్షణ గా ఉండి కాపాడుతుందని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. వ్యక్తుల ఆస్తులను కూల్చడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే అదనపు ప్రయోజనంఏమి లేదని, ఎవరికైనా అలాంటి నష్టం జరిగితే కింది స్థాయి నుండి ప్రిన్సుపల్ సెక్రెటరీ వరకు ఫిర్యాదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. దాంట్లో ఎలాంటి నష్టం జరగదనేది ప్రభుత్వం తరుపున కాంగ్రెస్ పార్టీ చెప్తుందని, మూసి ఐడేంటి పై జరుగుతుందని ఆయన తెలిపారు. అప్పుడే కూల్చి వేస్తున్నారని కొంత మంది రాజకీయ పక్షాల నాయకులు అంటున్నారని దయాకర్‌ అన్నారు.

Maulana Shahabuddin: మోడీ, యోగి ‘అఖండ భారత్’ కలని నేరవేర్చగలరు..

హక్కులను పోగొట్టుకున్న ఎవరైనా చట్ట పరంగా పొందే హక్కు ఉంటదని, ప్రభుత్వం కూడా ఇష్టానుసారంగా కూల్చదన్నారు అద్దంకి దయాకర్‌. సీఎం రేవంత్ రెడ్డికి వస్తున్న ఆదరణ,ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని, హైడ్రా ,మూసి విషయంలో ప్రజలకు నష్టం చేయాలని ప్రభుత్వానికి లేదన్నారు. కొంత మంది వ్యక్తులు మాత్రమే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రజలలో భయాందోళన సృష్టించడం రీవాజుగా మారిపోయిందని, ప్రతిపక్షాలు సంయమనం తో ఉండాల్సిన అవసరం ఉందన్నారు అద్దంకి దయాకర్‌.

Ra Macha : రా మచ్చా.. రామ్ అచ్చా!

Exit mobile version