NTV Telugu Site icon

adala prabhakar reddy: నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్‌ఛార్జీగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి!

Adala Prabhakar Reddy

Adala Prabhakar Reddy

adala prabhakar reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎపిసోడ్ వైఎస్సార్‌సీపీలో కాకరేపుతోంది. ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ట్యాపింగ్ కాదు, రికార్డింగ్ అంటూ మంత్రులు చెబుతుండగా.. నిగ్గు తేల్చేందుకు రంగంలోకి ఇంటెలిజెన్స్ అధికారులు దిగారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి విడుదల చేసిన ఆడియోపై వివరాలను సేకరిస్తున్నారు. శ్రీధర్ రెడ్డితో మాట్లాడిన రామ శివారెడ్డిని విచారించే అవకాశం ఇంది. రామ శివారెడ్డి ఫోన్ డేటాను ఇంటెలిజెన్స్ అధికారులు విశ్లేషిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్‌ఛార్జీగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించే అవకాశం ఉంది. ఇవాళ అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్‌తో ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ఇన్‌ఛార్జీగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి జగన్‌ను కలుస్తున్నామని ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి ఏ బాధ్యత ఇచ్చినా చేయటానికి సిద్ధంగా ఉన్నానన్నారు. నిన్నటి వరకు ఢిల్లీలో ఉన్నానన్న ఆయన.. కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యల సంగతి తనకు తెలియదన్నారు.

Nedurumalli Ramkumar Reddy: ఆనంకు నేదురుమల్లి సవాల్.. దమ్ముంటే వెంకటగిరిలో పోటీ చేయాలి..

పార్టీకి డ్యామేజ్ చేసే స్థాయి కోటంరెడ్డికి లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. జగన్ దయతో కోటంరెడ్డి ఎమ్మెల్యే అయ్యాడని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళే గెలుస్తారన్నారు. ట్యాపింగ్ అని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని తాను చేసిన ఛాలెంజ్‌కు కోటంరెడ్డి నుంచి సమాధానం లేదన్నారు. తన స్నేహితుడే ఫోన్ రికార్డ్ చేశాడని కోటంరెడ్డికి కూడా తెలుసన్నారు. ఆయన నియోజకవర్గంలో అతనే రాజ్యం చేశాడని.. మరి ఎందుకు అసంతృప్తి అంటూ ప్రశ్నించారు. ఇన్‌ఛార్జి ఎవరో ఇవాళ ముఖ్యమంత్రి నిర్ణయిస్తారని మాజీ మంత్రి బాలినేని స్పష్టం చేశారు.

Show comments