అదా శర్మ ఈ భామ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.తన నటనతో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది ఈ భామ.అదా శర్మ తెలుగు లో హార్ట్ ఎటాక్ అనే సినిమా తో పరిచయం అయిన సంగతి తెల్సిందే.ఆ సినిమా లో అదా శర్మ యంగ్ హీరో నితిన్ సరసన హీరోయిన్ గా నటించింది. పూరి జగన్నాధ్ ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా లో అదా లుక్స్ కి ఫ్యాన్స్ ఎంతగానో ఫిదా అయ్యారు. కానీ ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు.ఆ సినిమా నిరాశ పరిచినా కూడా అదా శర్మ చాలా సినిమా ల్లో ఆఫర్లు దక్కించుకుంది.రిసీంట్ గా ది కేరళ స్టోరీ సినిమా తో భారీ విజయం దక్కించుకున్న విషయం తెల్సిందే. చిన్న సినిమా గా విడుదలైన ఆ సినిమా వరుస వివాదాలతో ఊహించని ప్రమోషన్స్ జరిగి భారీ విజయం సాధించింది.అదృష్టం కొద్ది ఏ లేడీ ఓరియంటెడ్ సినిమాకు దక్కని భారీ వసూళ్లు ఈమె నటించిన ది కేరళ స్టోరీస్ సినిమాకు దక్కి రికార్డులు బ్రేక్ చేయడం జరిగింది.అంతే కాకుండా ఈ సినిమా కథ అందరికి బాగా కనెక్ట్ అవ్వడం తో భారీగా కలెక్షన్స్ రాబట్టింది.
ఈ సినిమా లో అదా శర్మ తన నటన తో అందరినీ ఎంతగానో మెప్పించింది.ఈ సినిమా తరువాత ఈ భామకు తెలుగులో అంతగా ఆఫర్స్ రాకపోయిన ఇతర భాషలలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో కూడా ఈ భామ ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. తన హాట్ హాట్ అందాలతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ తను ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోను షేర్ చేసింది.అందులో ఎత్తులో ఉన్న బాటిల్ మూతను సాక్స్ లు వేసుకున్న కాళ్లతో ఓపెన్ చేస్తున్నట్లుగా చూపించింది. కాళ్లతో తీస్తున్నట్లు చూపిస్తూ చేతితో తీసి మోసం చేస్తుంది అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు… ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.