NTV Telugu Site icon

Adah Sharma : దానిపై బుక్ రాస్తానంటున్న అదాశర్మ

Adah Sharma Kerala Story

Adah Sharma Kerala Story

Adah Sharma : ఇటీవలే కేరళ స్టోరీ, బస్తర్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించిన అదా శర్మ ప్రస్తుతం అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అదా శర్మ తెలుగులో ‘C.D (క్రిమినల్ లేదా డెవిల్)’ అనే సినిమాతో ఇటీవల ప్రేక్షకులను పలకరించింది. కృష్ణ అన్నం దర్శకత్వంలో ఎస్‌ఎస్‌సిఎం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అదా శర్మ ప్రధాన పాత్రలో విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, మహేష్ విట్టా.. ఇంకా పలు కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సిడి (క్రిమినల్ ఆర్ డెవిల్)’.

ఇటు సినిమాలతో అటు వెబ్ సిరీస్ లతో అదాశర్మ ఫుల్ బిజీగా ఉంది. ఆమె నటించిన తాజా సిరీస్‌ ‘రీటా సన్యాల్‌’ ఈ రోజు నుంచి ఓటీటీ ‘డిస్నీ+హాట్‌ స్టార్‌’ లో స్ట్రీమింగ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో అదాశర్మ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. ‘ది కేరళ స్టోరీ’.. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధించింది. అలాగే, రికార్డులను కూడా బ్రేక్‌ చేసింది. వాటికి మించి ప్రేక్షకుల హృదయాల్లో నాకు సుస్థిర స్థానాన్ని సంపాదించి పెట్టింది. నిజానికి ది కేరళ స్టోరీకి ముందు నేను ఎన్నో సార్లు నిరాశకు గురయ్యాను. ఆ సమయంలో ది కేరళ స్టోరీ వచ్చింది. ఆ కథ పై ఎంతో చదివాను. ఒక విధంగా దానిపై నేను పుస్తకం కూడా రాయగలనంటూ నవ్వుతూ సమాధానం చెప్పింది.

Read Also:World’s 26 Poorest Countries: ప్రపంచంలోని 26 పేద దేశాల అప్పులు 18 ఏళ్ల గరిష్టానికి చేరాయి..

Read Also:Durga idol immersion: దుర్గా విగ్రహ నిమజ్జనంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి.. 30 మంది అరెస్టు

Show comments