Site icon NTV Telugu

Jabardasth Anchor Rashmi: జబర్దస్త్ నుంచి రష్మి ఔట్? ప్రోమోలో కొత్త యాంకర్!

Rashmi

Rashmi

Jabardasth Anchor Rashmi: క్రేజీ యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’కు ఇప్పటికే టాటా చెప్పేశారు. తర్వాత ‘ఎక్స్ట్రా జబర్దస్త్’కు యాంకరింగ్ చేస్తున్న రష్మీ గౌతమ్ చేతిలో ఆ షో కూడా పెట్టారు నిర్వాహకులు. ఇప్పుడు ‘జబర్దస్త్’ నుంచి ఆమెను తీసేసి కొత్త యాంకర్ ను తీసుకొచ్చారు. బుల్లితెరపై రష్మి గౌతమ్ పాపులారిటీ అంతా ఇంతాకాదు. తన అందచందాలతో అభిమానులను అలరిస్తూ దూసుకుపోతున్నారు. గ్లామర్‏గా కనిపిస్తూ .. ఆడియన్స్‏ను కవ్వించే రష్మిని చూసేందుకే అభిమానులు షోలను చూస్తుంటారు. ఈ క్రమంలోనే రష్మీ… జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఆమె కావాల్సినంత పాపులారిటీని సంపాదించుకుంది.

Read Also: Sudigali Sudheer – Rashmi: ఎక్కడికి వెళ్లినా రష్మీనే అడుగుతున్నారు

కొద్దిరోజులుగా జబర్దస్త్ షో మాత్రమే కాకుండా ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు తనే హోస్ట్‏గా వ్యవహరిస్తూ బిజీ అయిపోయింది. ఓవైపు యాంకరింగ్‏తో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది రష్మీ. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. ఇందులో యంగ్ హీరో నందు కథానాయికుడిగా కనిపించారు. ఈ సినిమా నవంబర్ 4న విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది. అయితే తాజాగా యాంకర్ రష్మీకి జబర్దస్త్ షో నిర్వాహకులు షాకిచ్చారు. జబర్దస్త్ ప్రోమోలో రష్మీ స్థానంలో మరో కొత్త బ్యూటీ యాంకర్ గా కనిపించింది. దీంతో నిర్వాహకులు రష్మీని తీసేశారా అన్న సందేహం కలుగుతోంది.

Read Also: Man Kicked Boy : దూలతీరిందా.. కాలితో తన్ని కటకటాల్లోకి వెళ్లావు

రష్మీ స్థానంలో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన యాంకర్ ఎవరో కాదు.. అదే ఛానల్‏లో ప్రసారమయ్యే శ్రీమంతుడు సీరియల్ నటి… సౌమ్య రావు. ఇప్పుడు జబర్దస్త్ వేదికపై సందడి చేయనున్నట్లు హోస్ట్ ఇంద్రజ ఇంట్రడ్యూస్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో రిలీజ్ కాగా.. కొత్తగా వచ్చిన యాంకర్ పై హైపర్ ఆది తన స్టైల్లో పంచులు వేశారు. ఇక కృష్ణ భగవాన్, హైపర్ ఆది, ఆటో రాం ప్రసాద్ పంచులకు ఆమె ఇచ్చిన కౌంటర్స్ భలే ఫన్నీగా ఉన్నాయి.

Exit mobile version