Site icon NTV Telugu

Sai Pallavi: బాలీవుడ్‌పై ఆసక్తిర వ్యాఖ్యలు చేసిన సాయి పల్లవి!

Sai Pallavi

Sai Pallavi

బాలీవుడ్‌పై హీరోయిన్ సాయి పల్లవి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సమయంలో తనకు ఓ వ్యక్తి ఫోన్ చేసి.. తరచూ వార్తల్లో నిలవడం కోసం పీఆర్‌ టీమ్‌ను నియమించుకుంటారా? అని అడిగారని చెప్పారు. అలాంటివి తనకు ఇష్టం ఉండవని మొహం మీదనే చెప్పినట్లు పేర్కొన్నారు. నితేశ్‌ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’తో సాయి పల్లవి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

సాయి పల్లవి తాజాగా నటించిన సినిమా ‘అమరన్‌’. ఉగ్రదాడిలో అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవితాధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కమల్ హాసన్‌ నిర్మించిన ఈ సినిమాలో శివ కార్తికేయన్‌, సాయి పల్లవి జంటగా నటించారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న అమరన్‌ విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి.. బాలీవుడ్‌ పీఆర్‌ ఏజెన్సీల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: Gold Rate Today: సంతోషం ఒక్కరోజే.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు! కానీ మరో శుభవార్త

‘ఇటీవల బాలీవుడ్‌కు చెందిన ఒక వ్యక్తి నాకు ఫోన్‌ చేశారు. తరచూ వార్తల్లో నిలవడం కోసం మీరు పీఆర్‌ టీమ్‌ను నియమించుకుంటారా? అని అడిగారు. నాకు అలాంటిది ఏమీ అవసరం లేదని చెప్పా. నేను పీఆర్‌ టీమ్‌ను నియమించుకుంటే.. తరచుగా వార్తల్లో ఉండగలను. ప్రేక్షకులు, ఫాన్స్ తరచూ నా గురించి మాట్లాడుకుంటారు. కానీ దాని వలన నాకు ఎలాంటి ఉపయోగం ఉండదు. నిత్యం నా గురించి మాట్లాడాలన్నా.. ప్రేక్షకులకు బోర్ కొడుతోంది. అందుకే నేను నో చెప్పాను’ అని సాయి పల్లవి చెప్పారు. ప్రస్తుతం సాయి పల్లవి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

 

Exit mobile version