Sai Pallavi: ఇకపై ఊరుకునేది లేదు.. లీగల్ యాక్షన్ తీసుకుంటా: సాయిపల్లవి
- వరుస సినిమాలతో బిజీగా సాయిపల్లవి
- అమరన్‌తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న సాయిపల్లవి
- ఇన్నాళ్లు సహించాను కానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘బాక్సాఫీస్ క్వీన్’ సాయిపల్లవి ఇటీవలే ‘అమరన్’తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో ‘తండేల్’ చిత్రంలో నాగ చైతన్య సరసన నటిస్తున్న సాయిపల్లవి.. బాలీవుడ్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’లో నటించడానికి సిద్ధమయ్యారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణలో రాముడిగా రణ్‌బీర్ కపూర్.. సీతగా సాయిపల్లవి కనిపించనున్నారు. బాలీవుడ్ నిర్మాతలతో కలిసి టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
రామాయణ సినిమా కోసం సాయిపల్లవి ఎన్నో అలవాట్లు మార్చుకున్నారని కోలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనాలు రాసింది. సినిమా పూర్తయ్యేవరకు మాంసాహారం ముట్టుకోరని, హోటల్స్ ఫుడ్ కూడా తినడం లేదని, విదేశాలకు కూడా తన వంట వాళ్లను తీసుకెళ్తున్నారని రాసుకొచ్చింది. ఈ వార్తలపై తాజాగా సాయిపల్లవి స్పందించారు. నిరాధారమైన పోస్ట్‌లు పెడితే లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నిరాధారమైన రూమర్స్ రాస్తే.. ఎంత పెద్ద సంస్థ అయినా ఊరుకునేది లేదని, లీగల్ యాక్షన్ తీసుకుంటా అని ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం..
- Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
Also Read: Gabba Test: గబ్బాలో పేస్, బౌన్స్.. టీమిండియాకు పరీక్ష తప్పదు! 61 టెస్టుల్లో ఏడు సార్లు మాత్రమే
‘ఇప్పటికే నా గురించి ఎన్నోసార్లు రూమర్స్ వచ్చాయి. ప్రతిసారీ నేను మౌనంగానే ఉన్నా. ఎందుకంటే.. నిజం ఏంటో ఆ దేవుడికి తెలుసు. నేను మౌనంగా ఉంటున్నా అని రూమర్స్ ఇంకా ఎక్కువగా రాస్తున్నారు. నేను చాలా విసిగిపోయా. ఇన్నాళ్లు సహించాను కానీ.. ఇకపై ఊరుకునేది లేదు. స్పందించాల్సిన సమయం వచ్చింది. నా వ్యక్తిగతం, కెరీర్, సినిమా, యాడ్స్ ఏదైనా కావొచ్చు.. నాకు సంబంధించి నిరాధారమైన పోస్ట్‌లు, వార్తలు ప్రచురిస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటా. గుర్తింపు పొందిన మీడియా అయినా లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని సాయిపల్లవి పోస్టులో పేర్కొన్నారు.
Most of the times, Almost every-time, I choose to stay silent whenever I see baseless rumours/ fabricated lies/ incorrect statements being spread with or without motives(God knows) but it’s high-time that I react as it keeps happening consistently and doesn’t seem to cease;… https://t.co/XXKcpyUbEC
— Sai Pallavi (@Sai_Pallavi92) December 11, 2024
తాజావార్తలు
-
buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
-
India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
-
TG20 League: ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
-
Ragi Burelu: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. సాంప్రదాయ పద్ధతిలో ‘రాగి బూరెలు’ ఎలా చేయాలో తెలుసా?
-
APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!