Site icon NTV Telugu

Renu Desai: మంత్రి కొండా సురేఖను కలిసిన ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్

Renu Desai

Renu Desai

Renu Desai:ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్‌లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖను వారింట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై చర్చించారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే ప్రప్రథమంగా నెలకొల్పనున్న గీత యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను రేణు దేశాయ్ మంత్రి సురేఖకు వివరించారు. ఈ సందర్భంగా తమ ఇంటికి అతిథిగా వచ్చిన రేణుదేశాయ్‌ని మంత్రి సురేఖ నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు కుంకుమలతో సత్కరించారు. మంత్రి సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసుని మంత్రి సురేఖ రేణు దేశాయ్‌కి తన స్వహస్తాలతో అలంకరించారు.

Read Also: Cabinet Sub Committee: 317 జీవోపై కేబినెట్ సబ్‌కమిటీ భేటీ.. విచారణ చేసి నివేదిక అందజేయాలని నిర్ణయం

Exit mobile version