Site icon NTV Telugu

Rashmika Mandanna: రష్మిక ఫేవరెట్‌ హీరో ఎవరో తెలుసా.. మీరు అనుకున్నదే!

Rashmika Anand

Rashmika Anand

Anand Devarakonda-Rashmika Mandanna Interview Video: ‘బేబీ’తో మంచి విజయాన్ని అందుకున్న యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ ‘గం. గం.. గణేశా’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు. ఉదయ్‌ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాను హై-లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ప్రగతి శ్రీవాస్తవ, నయన్‌ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మే 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ట్రైలర్‌ని సోమవారం విడుదల చేసింది.

Also Read: SSMB 29: మహేశ్-రాజమౌళి ప్రాజెక్ట్‌లో బాలీవుడ్‌ నటుడు!

గం. గం.. గణేశా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరో ఆనంద్‌ దేవరకొండ అడిగిన పలు ప్రశ్నలకు రష్మిక సరదాగా సమాధానాలిచ్చారు. మీతో కలిసి నటించిన హీరోల్లో మీ ఫేవరెట్‌? అని అడగ్గా.. ఫాన్స్ అందరూ కామ్రేడ్, కామ్రేడ్ అని గట్టిగా అరిచారు. ఆనంద్ నువ్ నా ఫామిలీ రా.. ఇంట్ల స్పాట్‌లో పెడితే ఎట్లా అని రష్మిక ప్రశ్నించారు. మీరు సమాధానం చెప్పాల్సిందే అని ఆనంద్ అనగా.. రౌడీ బాయ్ అని చెప్పారు. రష్మిక, ఆనంద్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Exit mobile version