SSMB 29: మహేశ్-రాజమౌళి ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ నటుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devdatta Nage in Mahesh Babu’s Movie: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మహేశ్-రాజమౌళి ప్రాజెక్ట్‌కు SSMB29 అనేది వర్కింగ్ టైటిల్. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ హీరోయిన్‌గ.. హాలీవుడ్ నటుడు క్రిస్ హెమ్స్‌వర్త్ కీలక పాత్ర పోషించనున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
మహేశ్-రాజమౌళి ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ నటుడు దేవదత్త నాగే నటిస్తునట్లు పలు జాతీయ వైబ్‌సైట్స్‌లలో కథనాలు వస్తున్నాయి. ఆదిపురుష్‌లో హనుమంతుడిగా నటించిన దేవదత్త.. రాజమౌళి ప్రాజెక్ట్‌తో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాడట. తాజాగా రాజమౌళితో దేవదత్త ఫొటో దిగడం కూడా ఈ వార్తకు బలం చేకూరింది. ఇటీవల మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన విలన్‌గా కనిపించనున్నారని టాక్. ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఇప్పటివరకు స్పందించలేదు.
Also Read
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ కోసం మహేశ్ బాబుకు సంబంధించిన ఎనిమిది లుక్‌లను ఎస్ఎస్ రాజమౌళి టీమ్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి ‘మహారాజ్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇండియన్ సినిమా ఇప్పటివరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఈ చిత్రంతో సృష్టించనున్నట్లు తెలుస్తోంది. SSMB29పై పూర్తి వివరాలు త్వరలోనే తెలియరానున్నాయి.
తాజావార్తలు
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!