Site icon NTV Telugu

Pratyusha Case : ప్రత్యూష హీరోయిన్‌గా శ్రీదేవి, సౌందర్యల స్థాయికి చేరుకోవాలని అనుకుంది : ప్రత్యూష తల్లి

Pratyusha

Pratyusha

 తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రత్యూష. అందం, అభినయంతో అగ్ర హీరోయిన్లుగా వెలుగొందిన శ్రీదేవి, సౌందర్యల స్థాయికి చేరుకోవాలని కలలు కన్న ప్రత్యూష అందం, అభినయంతో మెప్పించి కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే ఏకంగా 22 సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ కు వెళ్తుంది అనుకునే టైమ్ లో అందరి వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళింది. సిద్ధార్థ్ రెడ్డి అనే మృగం కారణంగా ఆమె జీవితాన్ని అర్థాంతరంగా  ముగిసిందిని ఆమె తల్లి సరోజినీ దేవి గారు ఆరోపిస్తున్నారు.

Also Read :  AR Rahman vs Anirudh : ఫిబ్రవరి నెలాఖరున రెహమాన్, అనిరుధ్ మధ్య మ్యూజికల్ వార్!

తాజాగా ప్రత్యూష హత్య కేసులోసిద్దార్ధ రెడ్డి నాలుగు వారాల్లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ  కేసు విషయమై స్ ప్రత్యూష తల్లి సరోజినీ దేవి మీడియాతో మాట్లాడుతూ ‘ ప్రత్యూష హీరోయిన్‌గా శ్రీదేవి, సౌందర్యల స్థాయికి చేరుకోవాలని అనుకుంది, ఆమె ఒక పెద్ద హీరోయిన్ అయితే తనకు దక్కకుండా పోతుందనే స్వార్ధంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. కేవలం అది ఆత్మహత్య కాదని, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన అత్యాచారం చేసి హత్య చేసాడు. తన కూతురికి జరిగిన అన్యాయంపై న్యాయపోరాటం చేస్తూ, నిందితులకు తగిన శిక్ష పడింది. “నా బిడ్డను బలి తీసుకున్న వారందరూ కుక్క చావు చస్తారు.. పైకి వెళ్ళిన తర్వాత ప్రత్యూష కాళ్ల కింద పడి క్షమాపణలు చెప్పుకుంటారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నా. కానీ నా కూతురు కేసు విషయంలో న్యాయం జరిగిందని అనుకోవట్లేదు. నా కూతురును చంపేశారు. సాక్ష్యాధారాలను తారుమారు చేశారు. అన్ని సాక్ష్యాలు దొరికి ఉంటే నిందితుడికి జీవిత ఖైదు పడేది. మునిస్వామి రిపోర్టును కోర్టులు పరిగణలోకి తీసుకోలేదు. త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి రిపోర్టు తెప్పించారు. మునిస్వామి రిపోర్టును పరిగణలోకి తీసుకుంటే బాగుండేది. ప్రత్యూష మృతదేహాన్ని చూడలేదు. ఎలా చనిపోయిందో తెలియదు’ అని అన్నారు.

Exit mobile version