NTV Telugu Site icon

Poorna: హీరోయిన్ పూర్ణ పెళ్లియిందా.. ఎవరూ వెళ్లకపోవడానికి కారణం అదేనా..?

Poorna Engagement

Poorna Engagement

Poorna: నటనకు ఆస్కారమున్న పాత్రలను ఎంచుకుంటూ అభిమానుల మనసులు గెలుచుకున్న నటి పూర్ణ. 2007లో శ్రీమహాలక్ష్మి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సొంత రాష్ట్రం కేరళ. అసలు పేరు షమా ఖాసిమ్. ఆ తర్వాత సీమ టపాకాయ్‌, అవును, అవును2, లడ్డూబాబు, నువ్విలా నేనిలా, రాజుగారిగది, జయమ్ము నిశ్చయమ్మురా తదితర సినిమాలతో పక్కింటి అమ్మాయిలా మారిపోయింది. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళం సినిమాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల అభిమానం పొందింది. ఈ కేరళ ముద్దుగుమ్మ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను కొనసాగిస్తుంది. అంతేకాదు పలు టీవీ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతోంది.

Read Also: Happy Birthday Rebel Star Prabhas : ప్రభాస్ కు ఆ డైరెక్టర్ అంటే ఇష్టమట.. హ్యాపీ బర్త్ డే డార్లింగ్

ఇదిలా ఉంటే గత కొన్ని నెలలుగా పూర్ణ ప్రేమ, పెళ్లి గురించి రకరకాల వదంతులు వస్తూనే ఉన్నాయి. కాగా ఈ ఏడాది మే31న వ్యాపారవేత్త ఆసీఫ్‌ అలీతో పూర్ణ ఎంగేజ్‌మెంట్ జరిగింది. అయితే తర్వాత వీరిద్దరూ విడిపోయారని వార్తలు వచ్చాయి. అయితే వాటన్నిటినీ ఎప్పటికప్పుడూ ఖండిస్తూనే ఉంది. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న ముద్దుగుమ్మ తమకు జూన్‌లోనే పెళ్లైపోయిందంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. తనకు ప్రియుడు ఉన్నాడని.. ఆ విషయాన్ని ఇద్దరు దిగిన ఫోటోలతో సహా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది పూర్ణ. అతడి పేరు ఆసీఫ్ అలీ. ఇతడు అరబ్ దేశానికి చెందిన వ్యాపారవేత్త. అయితే ప్రస్తుతం వీరిద్దరి ప్రేమ బ్రేకప్ అయిందని ప్రచారం కూడా ఈమధ్య బాగా జరిగింది. అయితే ఎన్ని ప్రచారాలు జరిగినా ప్రస్తుతం పూర్ణ , ఆసిఫ్ అలీ దుబాయ్ లో ఉన్నారు. దీని గురించి నటి పూర్ణ ఓ భేటీలో పేర్కొంటూ తమ వివాహా , నిచ్చితార్థం ఈ ఏడాది మే నెల 31వ తేదీన జరిగిందని, జూన్ నెల 12వ తేదీన దుబాయ్ లో పెళ్లి అత్యంత సన్నిహితులు సమక్షంలో జరిగిందని తెలిపింది.

Read Also:Sanjay Dutt: బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్ దత్

దేశ సమస్య కారణంగా పలువురు తమ పెళ్లి వేడుకల్లో పాల్గొనలేకపోయారని , దీంతో త్వరలో కేరళలో వివాహ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఒక నాట్య పాఠశాలను ప్రారంభించనున్నట్లు చెప్పిన పూర్ణ ఇది తన చిరకాల కోరిక అని కూడా తెలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.

Show comments