Poorna: హీరోయిన్ పూర్ణ పెళ్లియిందా.. ఎవరూ వెళ్లకపోవడానికి కారణం అదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poorna: నటనకు ఆస్కారమున్న పాత్రలను ఎంచుకుంటూ అభిమానుల మనసులు గెలుచుకున్న నటి పూర్ణ. 2007లో శ్రీమహాలక్ష్మి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సొంత రాష్ట్రం కేరళ. అసలు పేరు షమా ఖాసిమ్. ఆ తర్వాత సీమ టపాకాయ్, అవును, అవును2, లడ్డూబాబు, నువ్విలా నేనిలా, రాజుగారిగది, జయమ్ము నిశ్చయమ్మురా తదితర సినిమాలతో పక్కింటి అమ్మాయిలా మారిపోయింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం సినిమాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల అభిమానం పొందింది. ఈ కేరళ ముద్దుగుమ్మ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను కొనసాగిస్తుంది. అంతేకాదు పలు టీవీ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతోంది.
Read Also: Happy Birthday Rebel Star Prabhas : ప్రభాస్ కు ఆ డైరెక్టర్ అంటే ఇష్టమట.. హ్యాపీ బర్త్ డే డార్లింగ్
Also Read
- North Korea: ఫుట్‌బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్‌హ్యాండ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
- TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
- Special Trains: సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
- Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
ఇదిలా ఉంటే గత కొన్ని నెలలుగా పూర్ణ ప్రేమ, పెళ్లి గురించి రకరకాల వదంతులు వస్తూనే ఉన్నాయి. కాగా ఈ ఏడాది మే31న వ్యాపారవేత్త ఆసీఫ్ అలీతో పూర్ణ ఎంగేజ్‌మెంట్ జరిగింది. అయితే తర్వాత వీరిద్దరూ విడిపోయారని వార్తలు వచ్చాయి. అయితే వాటన్నిటినీ ఎప్పటికప్పుడూ ఖండిస్తూనే ఉంది. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న ముద్దుగుమ్మ తమకు జూన్‌లోనే పెళ్లైపోయిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు ప్రియుడు ఉన్నాడని.. ఆ విషయాన్ని ఇద్దరు దిగిన ఫోటోలతో సహా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది పూర్ణ. అతడి పేరు ఆసీఫ్ అలీ. ఇతడు అరబ్ దేశానికి చెందిన వ్యాపారవేత్త. అయితే ప్రస్తుతం వీరిద్దరి ప్రేమ బ్రేకప్ అయిందని ప్రచారం కూడా ఈమధ్య బాగా జరిగింది. అయితే ఎన్ని ప్రచారాలు జరిగినా ప్రస్తుతం పూర్ణ , ఆసిఫ్ అలీ దుబాయ్ లో ఉన్నారు. దీని గురించి నటి పూర్ణ ఓ భేటీలో పేర్కొంటూ తమ వివాహా , నిచ్చితార్థం ఈ ఏడాది మే నెల 31వ తేదీన జరిగిందని, జూన్ నెల 12వ తేదీన దుబాయ్ లో పెళ్లి అత్యంత సన్నిహితులు సమక్షంలో జరిగిందని తెలిపింది.
Read Also:Sanjay Dutt: బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్ దత్
దేశ సమస్య కారణంగా పలువురు తమ పెళ్లి వేడుకల్లో పాల్గొనలేకపోయారని , దీంతో త్వరలో కేరళలో వివాహ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఒక నాట్య పాఠశాలను ప్రారంభించనున్నట్లు చెప్పిన పూర్ణ ఇది తన చిరకాల కోరిక అని కూడా తెలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
North Korea: ఫుట్‌బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్‌హ్యాండ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
-
Special Trains: సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
-
Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
ట్రెండింగ్
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!