NTV Telugu Site icon

Actress Namitha: మధురై ఆలయంలో నటి నమితకు చేదు అనుభవం

Namitha

Namitha

Actress Namitha: తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో నటి నమితకు చేదు అనుభవం ఎదురైంది. కృష్ణాష్టమి సందర్భంగా గుడికి వెళ్లిన తనను అడ్డుకున్నారని నమిత వీడియోను రిలీజ్ చేశారు, నన్ను, నా కుటుంబ సభ్యులను హిందూ కుల ధ్రువీకరణ పత్రం అడిగారని సిబ్బంది దురుసుగా, అహంకారంగా మాట్లాడారని నమిత వీడియోలో తెలిపింది. తాను పుట్టుకతో హిందువునని.. తనపై అగౌరవంగా ప్రవర్తించిన సిబ్బందిని చర్యలు తీసుకోవాలని నమిత డిమాండ్ చేసింది. ఈ ఘటన తనను ఎంతో బాధ పెట్టిందని నమిత పేర్కొంది. ఈ వీడియోలో నటి నమిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది చూసిన కొందరు నెటిజన్లు క్షమించమని సూచించారు. దీనిపై స్పందించిన ఆలయ పరిపాలన సిబ్బంది.. పైఅధికారులు చెప్పడం వల్లే అలా చేశామని.. కొంత సమయం వెయిట్‌ చేయమని చెప్పామని.. కానీ అడ్డుకోలేదన్నారు. నటి నమితతో మర్యాదగా మాట్లాడామని క్లారిటీ ఇచ్చారు.

Read Also: Tollywood: టాలీవుడ్ సూపర్ -10 ఫ్లాష్ అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి..

నటి నమిత జెమిని సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్‌లో వెంకటేష్, బాలకృష్ణ, ప్రభాస్ వంటి హీరోలతో నటించింది. తన కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని నమిత సినిమాలకు దూరం అయ్యారు. ఇక నమిత ఇద్దరు కవల పిల్లలకు కూడా జన్మనిచ్చింది. తన కుటుంబంతో ఎంజాయ్ చేస్తూ నెట్టింట షేర్ చేస్తుంది. తాజాగా, ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా గుడికి వెళ్లడంతో ఊహించని అనుభవం ఎదురైనట్లు నమిత ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది.

Show comments