Site icon NTV Telugu

Mehreen: వైభవంగా నటి మెహరీన్ పెళ్లి.. వరుడు ఎవరంటే?

Actress Mehreen Pirzada Marries

Actress Mehreen Pirzada Marries

టాలీవుడ్ ‘హనీ ఈజ్ బెస్ట్’ మెహరీన్ పిర్జాదా ఎట్టకేలకు ఒక ఇంటిదయ్యారు. గత కొంతకాలంగా తన పర్సనల్ లైఫ్ గురించి సైలెంట్‌గా ఉన్న ఈ బ్యూటీ, ఆదివారం నాడు అర్ష్‌ ఔలఖ్‌ను వివాహం చేసుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం వేడుకగా జరిగింది. హిమాచల్ ప్రదేశ్‌లోని చైల్ (Chail) అనే అందమైన హిల్ స్టేషన్‌లో ఈ వివాహ వేడుక జరిగింది. ప్రకృతి ఒడిలో, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుకను నిర్వహించారు. సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ ఈ విషయాన్ని మెహరీన్ అఫీషియల్‌గా ప్రకటించారు. “మరో కొత్త ప్రయాణం మొదలైంది” అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఫోటోల్లో నూతన వధూవరులు ఎంతో చూడముచ్చటగా ఉన్నారంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

నాని సరసన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో ఎంట్రీ ఇచ్చిన మెహరీన్, ఆ తర్వాత ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’ వంటి హిట్లతో గోల్డెన్ లెగ్ అనిపించుకున్నారు. మరీ ముఖ్యంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ సినిమాల్లో ‘హనీ ఈజ్ ద బెస్ట్’ అంటూ ఆమె చేసిన కామెడీ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక మెహరీన్ పెళ్లి ఫోటోలు చూసిన నటి హన్సిక, దర్శకుడు అనురాగ్ కశ్యప్ వంటి సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న ఈ జంటకు మనము కూడా ఆల్ ది బెస్ట్ చెబుదాం.

 

Exit mobile version