NTV Telugu Site icon

Keerthy Suresh: 15 ఏళ్ల ప్రేమ.. కాబోయే వాడిని పరిచయం చేసిన కీర్తి సురేశ్‌!

Keerthy Suresh

Keerthy Suresh

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. వచ్చే డిసెంబర్‌లో పెళ్లి అని, కీర్తికి కాబోయే వాడు ఇతడే అంటూ కొన్ని ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి. చివరకు ఆ రూమర్లే నిజమయ్యాయి. కీర్తి తనకు కాబోయే వాడిని పరిచయం చేశారు. ఇద్దరూ కలిసున్న ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. తన రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించారు.

దీపావళి వేడుకల్లో భాగంగా ఆంటోనీ తట్టిళ్‌తో కలిసి దిగిన ఫొటోని కీర్తి సురేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ’15 ఏళ్ల స్నేహబంధం జీవితాంతం కొనసాగనుంది. ఎప్పటికీ ఆంటోనీ-కీర్తి ఒక్కటే’ అని రాసుకొచ్చారు. ఇద్దరూ కలిసున్న ఫొటోని పోస్ట్ చేశారు గానీ.. ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. ఏదేమైనా ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. ఈ పోస్టుపై కీర్తి ఫాన్స్, పలువురు సెలబ్రిటీలు స్పందించి కంగ్రాట్స్‌ చెబుతున్నారు. కీర్తికి హీరోయిన్ రాశీ ఖన్నా కంగ్రాట్స్‌ చెప్పారు. ‘మేము ఇప్పుడే తెలుసుకున్నాం. కంగ్రాట్స్‌ లవ్‌’ అని రాశీ ఖన్నా కామెంట్ పెట్టారు.

Also Read: Naga Chaitanya-Sobhita: నాగచైతన్య, శోభితా పెళ్లి.. అవన్నీ రూమర్స్!

మలయాళ నిర్మాత సురేశ్, నటి మేనకల కూతురై కీర్తి సురేశ్. కీర్తి బాలనటిగా చేశారు. మలయాళీ సినిమా గీతాంజలితో నటిగా ఎంట్రీ ఇచ్చారు. నేను శైలజతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. మహానటి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీలో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రివాల్వర్‌ రీటా, బేబీ జాన్‌ చిత్రాలు చేస్తున్నారు. మరోవైపు ఇంజినీరింగ్‌ చదివిన ఆంటోనీ కొంతకాలం విదేశాల్లో ఉద్యోగం చేశాడట. ప్రస్తుతం కేరళలో పలు వ్యాపారాలు చేసుకుంటున్నాడని టాక్‌.