వరుస వివాదాలలో ఉన్న సినీ నటి కల్పిక పై తండ్రి సంఘవార్ గణేష్ గాచ్చిబౌలి పోలీసులకు పిర్యాదు చేశాడు. తన కూతురు కల్పిక డిప్రెషన్ లో ఉంది.. బార్డర్ లైన్ నార్సిస్టిక్ డిసార్డర్ తో బాధపడుతూ ఉంది.. గతంలో 2023లో ఆశ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అనంతరం మెడికేషన్ తీసుకుంది..రెండేళ్ళు గా మెడికేషన్ ఆపివేసింది. దీంతో తరచూ గొడవలు సృష్టిస్తుంది… న్యూసెన్స్ చేస్తుంది. కల్పిక వల్ల ఆమెకు.. కుటుంబ సభ్యులకు.. సాధారణ ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది.
Also Read:Kingdom: షాకింగ్: కింగ్డమ్ రిలీజ్ రోజే ఐబొమ్మ స్ట్రాంగ్ వార్నింగ్..
తాజాగా రిహాబిలిటేషన్ సెంటర్ కి కూడా తరలించాము. అక్కడి నుంచి డిశ్చార్జ్ అయింది..కల్పిక తరచూ న్యూస్ డిస్టబెన్స్.. క్రియేట్ చేస్తుంది. ఆమెను రియాబిటేషన్ సెంటర్ కు తరలించే విధంగా చర్యలు తీసుకోండని గచ్చిబౌలి పోలీసులకు కల్పిక తండ్రి సంఘవార్ గణేష్ ఫిర్యాదు చేశారు.. తండ్రి ఫిర్యాదు ఆధారంగా కల్పికపై సెక్షన్ 23 మెంటల్ హెల్త్ ఆక్ట్ ప్రకారం గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.