వరుస వివాదాలలో ఉన్న సినీ నటి కల్పిక పై తండ్రి సంఘవార్ గణేష్ గాచ్చిబౌలి పోలీసులకు పిర్యాదు చేశాడు. తన కూతురు కల్పిక డిప్రెషన్ లో ఉంది.. బార్డర్ లైన్ నార్సిస్టిక్ డిసార్డర్ తో బాధపడుతూ ఉంది.. గతంలో 2023లో ఆశ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అనంతరం మెడికేషన్ తీసుకుంది..రెండేళ్ళు గా మెడికేషన్ ఆపివేసింది. దీంతో తరచూ గొడవలు సృష్టిస్తుంది… న్యూసెన్స్ చేస్తుంది. కల్పిక వల్ల ఆమెకు.. కుటుంబ సభ్యులకు.. సాధారణ ప్రజలకు ప్రమాదం…
టాలీవుడ్ సినీ నటి కల్పిక మరోసారి వివాదం సృష్టించింది. ఈసారి హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ – కనకమామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్‌లో ఆమె చేసిన హంగామా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్యాబ్‌లో ఒంటరిగా రిసార్ట్‌కు వచ్చిన కల్పిక, రిసెప్షన్‌లో అడుగు పెట్టగానే మేనేజర్ కృష్ణపై దురుసుగా ప్రవర్తించింది. ఆమె ప్రవర్తన రిసార్ట్ సిబ్బందిని పూర్తిగా అయోమయంలోకి నెట్టింది. ఒక్కసారిగా మెనూ కార్డును విసిరేయడం, రూమ్ కీస్‌ను…