Sayaji Shinde Health: ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు సాయాజి షిండే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Sayaji Shinde Helth Updates: టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయాజీ షిండే ఆస్పత్రిలో చేరారు. ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు గురువారం (ఏప్రిల్ 11) ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షలు చేసిన వైద్యులు.. సాయాజీ షిండే గుండెలో బ్లాక్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతడికి ఆంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం సాయాజీ షిండే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మహారాష్ట్ర సతారాలోని ప్రతిభా ఆసుపత్రిలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
సాయాజీ షిండే ఆరోగ్యంపై ఆస్పత్రి వైద్యుడు సోమనాథ్ మాట్లాడారు. ‘సాయాజి షిండే కొద్ది రోజుల క్రితమే అస్వస్థతకు లోనయ్యారు. ఆయనకు పరీక్షలు చేయగా.. గుండెలో సమస్య ఉన్నట్లు తేలింది. హృదయంలోని కుడివైపు సిరలు పూర్తిగా మూసుకుపోయాయి. ఆంజియోప్లాస్టీ తప్పదని చెప్పాం. షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని.. చికిత్స కోసం ఆయన రెడీ అయ్యారు. ముందుగానే జాగ్రత్తపడటంతో సర్జరీ విజయవంతంగా పూర్తి చేశాం. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం’ అని సోమనాథ్ తెలిపారు. విషయం తెలుసుకున్న అభిమానులు సాయాజీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
Also Read: Rohit Sharma-Dinesh Karthik: ప్రపంచకప్ కోసమే ఆడుతున్నావ్ కదా.. కార్తీక్‌ను టీజ్ చేసిన రోహిత్!
సాయాజీ షిండే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గుడుంబా శంకర్, ఆంధ్రుడు, అతడు, టాగూర్, లక్ష్మి, ఆట, దుబాయ్ శీను, పోకిరి, అరుంధతి, సోలో, సూపర్, కృష్ణ, మిస్టర్ పర్ఫెక్ట్, దూకుడు, బిజినెస్‌మెన్.. లాంటి సినిమాలో నటించారు. ముందుగా విలన్ పాత్రలు చేసిన సాయాజీ షిండే.. ఆ తరువాత తండ్రి క్యారెక్టర్స్ కూడా చేసి మెప్పించాడు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, భోజ్‌పురి, హిందీ భాషల్లో కూడా ఆయన సినిమాలు చేశాడు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?