Actor Prudhviraj: షర్మిల ఇప్పడు జగనన్న వదిలిన బాణం కాదు.. అవన్నీ పాత రోజులని సినీనటుడు, జనసేన నేత పృధ్వీ అన్నారు. ఇప్పడు షర్మిల ఇండివిడ్యువల్.. కాంగ్రెస్ పార్టీ బాణం.. పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆ బాణం వల్ల వైసీపీ వారికి ఏం జరుగుతుందో చూడాలన్నారు. టీడీపీ, జనసేనల రెండు జెండాల కలయిక అద్భుతం.. ఇది మార్పుకు శుభసూచికమన్నారు జనసేన నేత పృథ్వీ. ఓ చోట గెలిచిన వ్యక్తిని మరోచోట తీసుకువెళ్లి వేస్తే ఓటు ఎవరు వేస్తారని ఆయన వైసీపీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. 175కు 175 సీట్లు మీరు గెలుస్తామన్నప్పుడు భయం ఎందుకు.. ఈ మార్పులు ఎందుకు అంటూ ప్రశ్నించారు. నేను సినిమాలో వేసిన అంబటి డ్యాన్సు గురించి ముందు తెలియదు.. డైరెక్టర్ చెప్పినట్లు చేశానన్నారు. రోడ్ల మీద డ్యాన్సులు వేసే వాళ్లు మంత్రులు ఏంటి అంటూ ఆయన అన్నారు.
Read Also: YSR Asara: గుడ్ న్యూస్.. డ్వాక్రా సంఘాల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్
130 స్దానాలతో టీడీపీ, జనసేనల మిశ్రమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పృథ్వీ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ వదిలిన బాణం పృధ్వీరాజ్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల వల్ల ఏపీలో ఏ ప్రాజెక్టు ఆగిపోయాయో చెప్పాలన్నారు. రోజా లాంటి బూతుల మినిస్టర్లు కుప్పకూలి పోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఏపీలో ఒక్క రాజధాని లేదు.. ఇంక మూడు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు.ఎన్నికలు మొదలవుతున్నాయి.. ప్రచారానికి వస్తాను.. ఒక్కొక్కరి దుమ్ము దులుపుతానన్నారు. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకూ తనను ప్రచారానికి వాడుకుని వదిలేసిన అధికార పార్టీ సంగతి చూస్తానన్నారు. ఎవరి జాతకం ఏంటనేది తన దగ్గర ఉందన్నారు. లోకేష్ బాబు దగ్గర ఎర్ర డైరీ ఉన్నట్లు తన దగ్గర కూడా ఓపీఆర్ డైరీ ఉందని.. అందరి జాతకాలు బయటపెడతానని పృధ్వీరాజ్ హెచ్చరించారు.