NTV Telugu Site icon

Jayasudha: బీజేపీ తీర్థం పుచ్చుకున్న జయసుధ.. మళ్లీ పోటీ అనేది కేవలం రూమర్

Jayasudha

Jayasudha

తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఇప్పటికే నుంచే వ్యూహాలను రచిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే పలు పార్టీలకు చెందిన అసంతృప్త నేతలను కమలం పార్టీలో చేర్చుకోవడంలో సఫలం అవుతుంది. అయితే, తాజాగా సినీనటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీ పార్టీలో చేరారు. తరుణ్ చుగ్, కిషన్ రెడ్డిల సమక్షంలో ఆమె కమలం పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధి చూడటం వల్లే బీజేపీ పార్టీలో చేరినట్లు ఆమె తెలిపారు. సంవత్సరం నుంచి బీజేపీ నాయకులతో చర్చలు జరుగుతున్నాయి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశాను.. ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.. కుల, మతాల పరంగా కాదు మంచి పని చెయ్యాలని కోరుకుంటున్నా.. క్రైస్తవుల వాయిస్ కోసం నేను పని చేస్తాను అని జయసుధ అన్నారు.

Read Also: Visakha : అక్కడేలా పార్క్ చేశావమ్మా… మద్యం మత్తులో మహిళా డాక్టర్ ర్యాష్ డ్రైవింగ్

ఎమ్మెల్యేగా నా పదవి కాలాన్ని పూర్తి చేశాను అని జయసుధ అన్నారు. ఆ తర్వాత రాజకీయాల్లో కనిపించక పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.. రాజకీయాలంటే మీకు తెలుసు కదా.. సమయాన్ని గౌరవించాలి.. టైంను నమ్ముతా.. ఇప్పటికీ సినిమాలు నాకు రావడం అదృష్టం అని ఆమె అన్నారు. అప్పుడప్పుడు.. మంచి క్యారెక్టర్లు ఉంటే చేస్తున్నాను.. ఇక, సికింద్రాబాద్ నుంచి మళ్లీ పోటీ అనేది కేవలం రూమర్ మాత్రమేనని బీజేపీ నేత జయసుధ తెలిపారు.

Read Also: KA Paul: నాలుగేళ్ళ నుంచి రమ్మంటున్నా… నేనొద్దు మోడీనే ముద్దంటున్నాడు!

జయసుధ సికింద్రబాద్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పని ఉన్నారు.. ఆమె బాలనటిగా సినిమాల్లోకి వచ్చారు.. 9 నంది అవార్డులు జయసుధ గెలుచుకున్నారు.. సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని ఆమె సంపాదించుకున్నారు అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జయసుధ ఎమ్మెల్యేగా ఉన్నపుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అని ఆయన పేర్కొన్నారు. జయసుధ బీజేపీ పార్టీలో చేరటం మాకు చాలా లాభం.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.. బీఆర్ఎస్ పార్టీ ఓడితెనే ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది అని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అన్నారు.

Read Also: Top Headlines@5PM: టాప్ న్యూస్