‘ప్రేమ ఖైదీ’ సినిమాతో పరిచయం అయ్యి.. ఆతర్వాత లవ్ ఫెయిల్యూర్ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది అమలాపాల్. తెలుగు, తమిళ్ భాషల్లో పలు అగ్ర హీరోల సరసన నటించింది. ఈవిడ కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటించి సినీ విమర్శకులను సైతం మెప్పించింది. అంతేకాదు తను నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమాలో నగ్నంగా నటించి వార్తలలో నిలిచింది.
Also Read: IPL 2024: ఐపీఎల్ 2024కు మహ్మద్ షమీ దూరం.. గుజరాత్ జట్టులోకి కేరళ స్పీడ్‌స్టర్!
ఈవిడ నిజ జీవితంలో కూడా జరిగిన కొన్ని సంఘటనల వల్ల వార్తలలో నిలిచింది. మొదటగా ఈవిడ తమిళ దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ వారిద్దరూ విడిపోయారు. ఇప్పటికీ వారు ఎందుకు విడిపోయారు అన్న విషయం ఎవరికీ తెలియదు. ఈ బ్రేకప్ తర్వాత అమలాపాల్ మళ్లీ పెళ్లి చేసుకుంది. జగత్ దేశాయ్ రెండో భర్తగా అంగీకరించింది. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆవిడ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రేక్షకుల కోసం షేర్ చేస్తూ ఉంటుంది.
Also Read: IPL 2024: ముంబై ఇండియన్స్ లోకి 17 ఏళ్ల యువ సంచలన పేసర్..!
ఇకపోతే తాజా ఈ అమ్మడు ఓ గుడ్ న్యూస్ తెలిపింది. ఇందుకు సంబంధించి అమలాపాల్ సోషల్ మీడియాలో ఓ క్రేజీ పోస్ట్ కూడా చేసింది. అదేంటంటే.. ఆవిడ త్వరలోనే కవల పిల్లలకు జన్మనివ్వబోతోంది. ఈ విషయం సంబంధించి ఒక చిన్న పాపని ఎత్తుకొని ‘ టూ హ్యాపీ కిడ్స్’ అంటూ క్యాప్షన్ పోస్ట్ చేసింది. దీంతో అమలాపాల్ అతి త్వరలో ట్విన్స్ కు జన్మ ఇవ్వబోతున్నట్లు అర్థమవుతుంది. ఇకపోతే ఈ విషయంపై నిజంగా కవలలు జన్మిస్తారా.. లేక మరి ఏమైనా అన్న విషయం పూర్తిగా తెలియాల్సి ఉంది.