NTV Telugu Site icon

Lawrence Bishnoi Gang: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన 7 మంది షూటర్లు అరెస్ట్‌

Lawrence Bishnoi Gang

Lawrence Bishnoi Gang

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దృష్టి సారించింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన మరో ఏడుగురు షూటర్లను అరెస్ట్ చేసింది. షూటర్లందరినీ పంజాబ్, ఇతర రాష్ట్రాల నుంచి అరెస్టు చేశారు. కాల్పులు జరిపిన వారి నుంచి ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కూడా ఉక్కుపాదం మోపింది.

READ MORE: CM Chandrababu: సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం ఫోకస్..

లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌పై ఎన్‌ఐఏ రూ.10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. అన్మోల్ బిష్ణోయ్ అలియాస్ భాను పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు. గాయకుడు-రాజకీయ నాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. 2023లో దర్యాప్తు సంస్థ అతనిపై చార్జిషీటు దాఖలు చేసింది. పోలీసుల నివేదిక ప్రకారం.. అతను నకిలీ పాస్‌పోర్ట్‌తో భారతదేశం నుంచి పారిపోయాడు. అన్మోల్ బిష్ణోయ్ తన లొకేషన్‌లను మారుస్తూ ఉంటాడు. గతేడాది కెన్యా, ఈ సంవత్సరం కెనడాలో కనిపించాడు. అన్మోల్ బిష్ణోయ్‌పై 18 క్రిమినల్ కేసులు నమోదైనట్లు సమాచారం. జోధ్‌పూర్ జైలులో శిక్షను అనుభవించాడు. అన్మోల్ 2021 అక్టోబర్ 7న బెయిల్‌పై విడుదలయ్యాడు.

READ MORE:RRB NTPC Recruitment 2024: రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. ఈనెల 27 వరకే ఛాన్స్‌..

ఇదిలా ఉండగా.. బాబా సిద్ధిఖీ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ నిందితుడిని విచారించగా, కాల్పులు జరిపిన వ్యక్తి లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌తో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు తెలిసింది. హత్యకు ముందు నిందితులు అన్మోల్ బిష్ణోయ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి వరకు ముంబై క్రైమ్ బ్రాంచ్ 11 మందిని అరెస్టు చేసింది.