Site icon NTV Telugu

Acid Attack: దేశరాజధానిలో మైనర్‌పై యాసిడ్ దాడి.. నిందితులు అరెస్ట్

Acid Attack

Acid Attack

Acid Attack: దేశరాజధాని ఢిల్లీలోని ద్వారకలో ఇవాళ ఉదయం 17 ఏళ్ల బాలికపై యాసిడ్‌ దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేయడంతో పోలీసులు కేసును ఛేదించినట్లు ద్వారక డీసీపీ ఎం.హర్షవర్ధన్ బుధవారం తెలిపారు.

ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. బాలికను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు తనకు తెలిసిన ఇద్దరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం యాసిడ్ దాడి ఘటనలో మరో బాలుడు ప్రధాన నిందితుడిగా నిలిచాడని ద్వారకా డీసీపీ బుధవారం తెలిపారు. విచారణలో ప్రధాన నిందితుడిగా మరో బాలుడు బయటపడ్డాడని, నిందితుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశామని, అన్ని ఆధారాలపై చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

Pathaan Issue: ఆ సీన్లు తొలగిస్తారా.. సినిమాను తొలగించాలా?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్ స్టేషన్ మోహన్ గార్డెన్ ప్రాంతంలో బాలికపై యాసిడ్ పోసిన ఘటనపై పీసీఆర్ కాల్ వచ్చింది. ఈ ఉదయం 7:30 గంటల సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు యాసిడ్ ఉపయోగించి బాలికపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా సమయంలో బాలిక తన చెల్లెలితో ఉంది. ప్రాణాలతో బయటపడిన బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా నిందితుల్లో ఒకరిని పోలీసులు ముందుగా అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని.. విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

 

Exit mobile version