Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు.. నిందితుడు జైలులో ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan: బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పుల కేసులో ఇద్దరు ఆయుధాల సరఫరాదారుల్లో ఒకరు ఈరోజు పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 26న పంజాబ్‌లో అరెస్టయిన అనూజ్ తపన్ (32) ఉదయం 11 గంటలకు పోలీసు లాకప్‌కు అనుబంధంగా ఉన్న టాయిలెట్‌కి వెళ్లి ఉరివేసుకున్నట్లు సమాచారం. రాత్రి నిద్రించేందుకు కేటాయించిన దుప్పటితో అతడు ఉరి బిగించుకున్నాడు. బుధవారం ఉదయం పోలీసులు సాధారణ తనిఖీ కోసం వెళ్లగా అపస్మారక స్థితిలో పడివున్న అనూజ్ తపన్ను పోలీసులు టాయిలెట్లో గుర్తించారు. అత్యవసరంగా హాస్పిటల్‌కు తరలించినప్పటికీ.. అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించినట్టు తెలుస్తోంది. అనూజ్ తపన్, మరో నిందితుడు సోను సుభాష్ చందర్ ఏప్రిల్ 14న సల్మాన్ ఖాన్ ముంబై ఇంటి వెలుపల కాల్పులకు ఉపయోగించిన ఆయుధాలను ఇచ్చారని పోలీసులు అరెస్ట్ చేశారు. అనూజ్ తపన్ ఆత్మహత్యకు పురికొల్పింది ఏమిటనేది దర్యాప్తులో ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Also: Blade Attack: బ్లేడ్ తో దాడి చేసుకున్న విద్యార్థినులు.. వైరల్ వీడియో..
Also Read
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
కాగా ముంబైలోని బాంద్రా ఏరియాలో ఉన్న సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులకు పాల్పడ్డ నిందిత షూటర్లు విక్కీ గుప్తా, సాగర్ పాల్‌లకు అనూజ్ తనన్ ఆయుధాలు అందించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఏప్రిల్ 26న అనూజ్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా అనూజ్ ఆత్మహత్యాయత్నానికి దారితీసిన కారణాలపై విచారణ జరుగుతోందని ముంబై పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే ఇది ముమ్మాటికి హత్యేనని మహారాష్ట్ర మాజీ సీనియర్ పోలీసు అధికారి పీకే జైన్ అనుమానం వ్యక్తం చేశారు. లాకప్‌లో ఎవరు మరణించినా హత్యగానే పరిగణించాలని అన్నారు. పోలీసులు సాధారణంగా లాకప్‌లను తనిఖీ చేస్తుంటారని అన్నారు. ఖైదీలు తప్పించుకోకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా పోలీసుల నిఘా ఉంటుందని సందేహాలు లేవనెత్తారు.
తాజావార్తలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
-
Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!